నిజామాబాద్

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 7: తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కారోబార్లను, కార్మికులను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్, బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్లు, కార్మికుల సంఘం జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, పారిశుద్ధ్య కార్మికుల నిర్వర్తిస్తున్న విధుల వల్లే ప్రజలు సుఖఃవంతమైన జీవితాన్ని వెల్లదీస్తున్నారని అన్నారు. కానీ, కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వర్తిస్తున్న కారోబార్లు, కార్మికులు మాత్రం చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదీస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్లే కారోబార్లు, కార్మికుల ఉద్యోగాలు రెగ్యులర్ కాలేదని, ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ టిఆర్‌ఎస్ వీరిని క్రమబద్దీకరించడంలేదని ఆరోపించారు. ప్రతి ఒక్కరు కడుపునిండా రెండు పూటలు భోజనం చేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, మరీ పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో పస్తులుంటున్న తరుణంలో బంగారు తెలంగాణ ఏలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. కారోబార్లు, కార్మికుల పక్షాన తాను హైకోర్టులో వేసిన పిల్‌పై 12రోజులు వాదనలు జరిగాయని, తాను లేవనెత్తిన 9చట్టాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. ఆ కమిటీ రెండు మాసాల్లో 9చట్టాలను అమలు చేయాలని ఆర్‌టి జీవో నెంబర్ 613ను జారీ చేసిందని, ఆరు మాసాలు గడిచినా ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడం వల్లే మళ్లీ ఉద్యోగులతో రిట్ ఫిటిషన్ వేయడం జరిగిందన్నారు. దానిని స్వీకరించిన న్యాయస్థానం ప్రభుత్వం నెల రోజుల్లో కౌంటర్ దాఖలు చేయడమే కాకుండా అర్హులైన ఉద్యోగులను రెగ్యులర్ చేసి, మిగతా వారికి 15వేల చొప్పున వేతనం ఇస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయడంలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌ను స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చిన కెసిఆర్, కవిత, పోచారం శ్రీనివాస్‌రెడ్డి రెండు సంవత్సరాలు గడిచిన ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా, లాకౌట్ ప్రకటించారని ఆరోపించారు. గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తిస్తున్న కారోబార్లు, కార్మికుల ఉద్యోగాలు క్రమబద్దీకరించే వరకు తాను పోరాటం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.