నిజామాబాద్

నిజామాబాద్‌లో నరుూం ముఠా సంచారం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 8: డబ్బులను కూడబెట్టుకునేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుని లెక్కకుమిక్కిలి నేరాలకు పాల్పడిన గ్యాంగ్‌స్టర్ నరుూం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైనప్పటికీ, అతని ముఠాకు చెందిన సభ్యులు నిజామాబాద్ జిల్లాలో సంచరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిచ్‌పల్లికి చెందిన జడ్పీటిసి అరుణ భర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి అమృతాపూర్ గంగాధర్‌ను కోటి రూపాయల డబ్బులు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగులోకి రాగా, ఇదే తరహాలో మరికొందరు ప్రముఖ కాంట్రాక్టర్లను కూడా నరుూం ముఠా నుండి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అమృతాపూర్ గంగాధర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పక్కాగా సేకరించడాన్ని బట్టి చూస్తే ఈ ముఠాకు చెందిన సభ్యులు స్థానికంగానే ఉండి ఈ వివరాలను ఆరా తీసినట్టు భావిస్తున్నారు. గంగాధర్ సతీమణి డిచ్‌పల్లి జడ్పీటిసిగా కొనసాగుతున్న విషయంతో పాటు అతని ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, మరొకరు జర్మనీలో ఉంటున్న విషయాన్ని వెల్లడించడం, గంగాధర్ ఇప్పటివరకు ఎక్కడెక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించాడు, అతని కుటుంబం పేరిట ఉన్న స్థిర, చరాస్థుల వివరాలన్నీ నూటికి నూరు శాతం పక్కాగా నరుూం వెల్లడించడాన్ని బట్టి చూస్తే అతని ముఠాకు చెందిన సభ్యులు రెక్కీ నిర్వహించి మరీ పూర్తిస్థాయిలో ఈ వివరాలు సేకరించినట్టు స్పష్టమవుతోంది. కోటి రూపాయలను ‘్భయ్’కు ముట్టజెప్పాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలతో కూడిన ఎస్‌ఎంఎస్‌లు చేయడాన్ని బట్టి ఈ సంక్షిప్త సందేశాలను అతని అనుచరులు గంగాధర్‌కు పంపించినట్టు తెలుస్తోంది. నిన్ను కానీ, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఎంతో సునాయాసంగా కిడ్నాప్ చేసి హాని తలపెడతామని పేర్కొనడం ద్వారా గంగాధర్‌కు, అతని కుటుంబ సభ్యులకు అసలేమాత్రం భద్రత లేదనే అంశాన్ని నరుూం ముఠా రెక్కీ ద్వారా గ్రహించినట్టు తేటతెల్లమవుతోంది. బాధితుడు అమృతాపూర్ గంగాధర్ కూడా ఈ విషయమై ఒకింత ఆందోళన వెలిబుచ్చారు.
కరడుగట్టిన నేరస్థుడైన నరుూంను పోలీసులు మట్టుబెట్టడం వల్ల తనకు పునర్జన్మ లభించినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. అయితే తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పక్కాగా వెల్లడించిన విషయాన్ని బట్టి చూస్తే అతని అనుచరులు కానీ, నరుూం ముఠాకు చెందిన వారు స్థానికంగానే సంచరిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వారిని కూడా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటే తాను పూర్తిగా ప్రాణహాని నుండి బయటపడినట్లు అవుతుందని పేర్కొన్నాడు. వాస్తవంగానే జిల్లాకు చెందిన మరికొందరు ప్రముఖ కాంట్రాక్టర్లకు కూడా నరుూం ముఠా నుండి బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
మాక్లూర్ మండలానికి చెందిన కిషన్‌రావు, రామారావు అనే కాంట్రాక్టర్లను కూడా ఇటీవలి కాలంలోనే ఫోన్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్టు సమాచారం. సదరు వ్యక్తులకు రాష్ట్ర స్థాయి నేతతో సమీప బంధుత్వం సైతం ఉన్నట్టు తెలిసింది. దీంతో నరుూం ముఠా నుండి వచ్చిన బెదిరింపుల విషయాన్ని పోలీసులకు వివరించి గోప్యంగా దర్యాప్తు జరిపించినట్టు సమాచారం. గంగాధర్‌తో పాటు మరికొందరికి ఈ తరహా బెదిరింపులు రావడంతో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్ తీవ్రంగా పరిగణిస్తూ తన అధీనంలో పని చేసే స్పెషల్ టీంను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. ఈ బృందం అందించిన పక్కా సమాచారం మేరకు నరుూం ఆచూకీని తెలుసుకుని అతనిని ముట్టుబెట్టినప్పటికీ, ముఠా సభ్యుల కదలికలపైనా నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాపార వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.