నిజామాబాద్

భక్తుల పుష్కర స్నానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 11: మోర్తాడ్ మండలంలోని తడ్‌పాకల్ గోదావరి నదిలో గత 11రోజులుగా జరుగుతున్న అంత్య పుష్కరాలు గురువారంతో ముగిశాయి. దాదాపు ఈ ఒక్కరోజే 600పైచిలు మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సంవత్సరం క్రితం జరిగిన గోదావరి పుష్కరాల్లో 11రోజుల పాటు లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించగా, అంత్య పుష్కరాలకు నామమాత్రంగానే స్పందన కనిపించింది. శుక్రవారాల్లో మాత్రమే భక్తుల రద్దీ కనిపించగా, గురువారం చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకపోయినప్పటికీ, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి రామాలయంలో పూజలు నిర్వహించి వాంట వార్పు చేసుకుని భోజనాలు చేశారు. అధికారికంగా మండలంలోని దోంచంద, గుమ్మిర్యాల్ పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా, మొదటి మూడు రోజులు భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మొత్తానికి 12సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను రామాలయ పూజారులు సాయంత్రం గోదావరికి హారతి ఇచ్చి, నదికి పూజలు చేసి ముగించారు. ఈ కార్యక్రమంలో తడ్‌పాకల్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, దేవాలయ సమితి సభ్యులు పాల్గొన్నారు.