నిజామాబాద్

14న ఎర్రపహాడ్‌కు సిఎం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఆగస్టు 11: డివిజన్‌లోని తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 14వ తేది రానున్నారు. డివిజన్‌లోని ఎల్లారెడ్డి శాసనసభ్యుడు ఏనుగు రవీందర్‌రెడ్డి తల్లి రాజమ్మ ఇటివలే మృతి చెందిన విషయం తెల్సిందే. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఎర్రపహాడ్‌లోని ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకోనున్నారు. ఎర్రపహాడ్‌లో ఈనెల 14వ తేది ఎమ్మెల్యే తల్లి రాజమ్మ 9రోజు కర్మ కార్యక్రమం సందర్భంగా శాసనసభ్యుడి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా వచ్చి పరామర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ యోగితారాణా తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్, సంయుక్త కలెక్టర్ ఎ.రవిందర్‌రెడ్డి, ఇంటిలిజెన్సి డిఎస్పీ మనోహర్‌తో పాటు కామారెడ్డి ఆర్‌డిఓ నగేశ్, ఇతర అధికారులతో కలిసి తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చేరుకోని సిఎం పర్యటన విషయమై ఎమ్మెల్యేతో చర్చించారు. సిఎం రాక సందర్భంగా హెలిఫ్యాడ్ ఏర్పాట్లు, అక్కడి నుండి ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యేతో కలెక్టర్, ఎస్పీలు దాదాపు అరగంట పాటు చర్చించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు ఎర్రపహాడ్ సమీపంలో ఉన్న ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక హెలిఫ్యాడ్ పనులను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఎస్పీలు వివరించారు.
జాతీయ రహదారి, కామారెడ్డి మున్సిపాలిటీ, కామారెడ్డి - ఎల్లారెడ్డికి వెళ్లే రోడ్లకు ఇరువైపుల హరితహారం మొక్కలు నాటించి వాటికి కంచెలు ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడే ఉన్న ఆర్‌డిఓ నగేశ్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు డ్వామా పిడి వెంకటేశ్వర్లు, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిఎంఅండ్‌హెచ్‌ఓ వెంకట్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మదుసుధన్‌రెడ్డి, పిఆర్ ఎస్‌ఇ సత్యమూర్తి, డిఎఫ్‌ఓ సుజాత, తదితరులున్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరార్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సందర్భంగా ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రంలో యుద్దప్రతిపాదికన హెలిప్యాడ్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులు హెలిప్యాడ్ నిర్మాణ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జిల్లా స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అధికారులు హెలిప్యాడ్ నుండి దాదాపు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న హెలిప్యాడ్ నుండి ఎర్రపహాడ్‌లో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం వరకు సిఎం వెళ్లే దారి వెంట క్షుణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. రోడ్లపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రోడ్లకు మరమత్తులు చేస్తున్నారు. సిఎం రాక సందర్భంగా పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. సిఎం రాక సందర్భంగా ఎర్రపహాడ్‌లోని ఎమ్మెల్యే ఇంటి పరిసరాలను పరిశీలించి సిఎం కాన్వాయి వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.