నిజామాబాద్

చురుగ్గా సాగుతున్న పైప్‌లైన్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 16: గ్రామ ప్రజలకు నేరుగా కుళాయిల ద్వారా శుద్ధి జలాలను అందించే మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల్లో చురుగ్గా సాగుతున్నాయి. పెద్దమొత్తంలో ఇప్పటికే పైప్‌లను గ్రామాలకు కాంట్రాక్టర్లు చేరవేశారు. రోడ్డుకు ఇరువైపులా ఎటు చూసినా కుప్పలుగా పోసిన పైప్‌లే కనిపిస్తున్నాయి. భూగర్భంలో పైప్‌లైన్ నిర్మాణం కోసం పొక్లెయినర్ సహాయంతో కందకాలు తీస్తున్నారు. అయితే పంట పొలాల్లో ముందస్తుగానే పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టాలని, రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే 70శాతం మేర పైప్‌లైన్ నిర్మాణం పనులను అధికారులు పూర్తి చేయించారు. అన్ని గ్రామాలకు భూగర్భ పైప్‌లైన్ల ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో సిమెంట్ పైప్‌ల స్థానంలో పిసిసి పైప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తాళ్లరాంపూర్, తడ్‌పాకల్ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇలాంటి పైప్‌లను ప్రత్యేక యంత్రాల సహాయంతో వేడి చేస్తూ అతికిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల పైపుల్లో లీకేజీలు ఏర్పడవని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే చిన్నపాటి కందకాలు తీసి, వాటిలో అతికించిన పైప్‌లను అమర్చనున్నారు. గ్రామాలకు చేరిన వెంటనే మంచినీటి ట్యాంకులకు అనుసంధించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బషీరాబాద్, కోనాసముందర్ గ్రామాల మధ్య జరుగుతున్న పైప్‌లైన్ల నిర్మాణ పనుల్లో పైపుల కోసం తీసిన కందకాలు వర్షపు నీటితో నిండిపోవడంతో పైపులు వేసేందుకు ఆటంకంగా మారింది. అయితే పంట పొలాల్లో ఇప్పటికే పైపులైన్లు వేయడం పూర్తయిందని, అటవీ ప్రాంతాల్లో తీసిన కాంటూర్ కందకాల్లో త్వరలో పైపులను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. మిషన్ భగీరథ కార్యాలయంలో భాగంగా మోర్తాడ్ తహశీల్ కార్యాలయం వద్ద ఉన్న జలాల్‌పూర్ సంప్‌హౌజ్ ప్రక్కనే లక్షా 50వేల లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక సంప్‌హౌజ్ నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి. కోనాసముందర్ సంప్‌హౌజ్ వద్ద కూడా అదనపు సంప్‌హౌజ్ పనులు జరుగుతున్నాయి. సంవత్సరంలోగా బాల్కొండ నియోజకవర్గం ప్రజలకు మిషన్ భగీరథ జలాలు అందిస్తామని ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే, పథకం వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించడంతో ఆదరించారు. సదరు నాయకులు కూడా రోజు వారి నివేదికలను ఎమ్మెల్యేకు పంపుతున్నారు.