నిజామాబాద్

బొర్లంలో ఎక్సైజ్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్స్‌వాడ, మార్చి 21: బాన్స్‌వాడ మండలంలోని బొర్లం గ్రామంలో సోమవారం జరిపిన దాడుల్లో 1.500కేజీల కల్లులో కలిపి మత్తుమందు అయిన అల్పోజోలమ్ పట్టుబడిందని కామారెడ్డి ఎక్సైజ్ ఎఇఎస్ పీర్‌సింగ్ తెలిపారు. బాన్స్‌వాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, అల్ఫోజోలమ్‌తో పాటు 48కిలోల అనుమానిత పౌడర్, 2కీలోల శక్రీన్, 20లీటర్ల అనుమానిత కెమికల్ పట్టుబడినట్లు చెప్పారు. ఇంతే కాకుండా వెయ్యి లీటర్ల కల్లును పారపోసినట్లు చెప్పారు. ఈ కేసులో ఒక వ్యక్తి పట్టుబడగా మిగతా ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్లు చెప్పారు. ఇంతే కాకుండా కామారెడ్డి పట్టణంలోని రెండు కల్లు దుకాణాలను ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించి శాంపుల్స్‌ను సేకరించినట్లు చెప్పారు. కల్లులో మత్తును ఇచ్చే అల్ఫోజోలమ్ అనే మందు చాలా ప్రమాదకరమైందని, దీన్ని కల్లులో కలుపుతున్నారని, ప్రజలు జాగ్రత్త పడాల్సిందిగా సూచించారు. కల్లుదుకాణాలపై దాడులు నిర్వహిస్తూ శాంపిల్స్‌ను సేకరిస్తున్నట్లు చెప్పారు. అల్పోజోలమ్ కల్లులో కలుపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడితే ఎంతటి వారైన సరే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కల్లులో కలుపుతున్నశెక్రీన్, అనుమానిత కెమికల్స్, అన్ని కూడా ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ దాడుల్లో స్థానిక ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.