నిజామాబాద్

బ్రిక్స్ సదస్సులో తెలంగాణ పథకాలను వివరించిన ఎంపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఆగస్టు 21: పింక్‌సిటి జైపూర్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హతరిహారం, మిషన్ కాకతీయ పథకాలపై ప్రస్తావించారు. సదస్సులో భాగంగా రెండవ రోజు ‘పర్యావరణంలో వస్తున్న మార్పులు - సభ్య దేశాలు తీసుకోవాల్సిన చర్యల’పై చర్చ జరుగగా, ఎంపి కవిత పై పథకాలను ప్రస్తావించారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితో చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 230కోట్ల మొక్కలు నాటేందుకు మహాయజ్ఞంలా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 1300కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని ఎంపి వెల్లడించారు.
మొత్తం మానవ ఇతిహాసంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం చరిత్ర సృష్టించబోతోందని ఎంపి కవిత బ్రిక్స్ ప్రతినిధులకు వివరించారు. తద్వారా తెలంగాణలో 22శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇక రైతుల సంక్షేమంపై మాట్లాడుతూ, తెలంగాణలో అధిక శాతం అన్నదాతలు చెరువులపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారని, వారిని ఆదుకునేందుకు మిషన్ కాకతీయ పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువుల పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గడిచిన రెండేళ్ల కాలంలో 6000కోట్ల రూపాయలు వెచ్చించి 17,400వేల చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు, అలుగుల బలోపేతం, తూముల, పంట కాల్వల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని సభ్యులకు వివరించారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని మొత్తం 46వేల చెరువులను ఆధునీకరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పటీష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని ఎంపి కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం రైతులకు సాగునీరు అందించడంతో పాటు అడుగంటిపోయిన భూగర్భ జలమట్టం పెంపుదలకు ఎంతగానో దోహదపడుతోందని ఎంపి కవిత బ్రిక్స్ ప్రతినిధులకు వివరించారు. దీంతో పర్యావరణ, సహజ వనరుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు.