నిజామాబాద్

తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 26: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని టిజెఎసి చైర్మన్ గోపాల్‌శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా హౌజింగ్ శాఖలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలను ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ భవిష్యత్ బాగుటుందని, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని భావించిన వారికి ప్రభుత్వం నిరాశే మిగుల్చుతోందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణాగా మారుస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న హామీలు ప్రచారాలకే తప్పా, ఆచరణలో కనిపించడం లేదన్నారు. అసలు బంగారు తెలంగాణ సిఎం కుటుంబానికే వచ్చిందని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు రాలేదన్నారు. ఉద్యోగుల గురించి సిఎం కెసిఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలకు శనివారం టి.జెఎసి రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కోదంరాం సందర్శించి సంఘీభావం ప్రకటించడం జరుగుతుందని గోపాల్‌శర్మ తెలిపారు.