నిజామాబాద్

నకిలీ హౌసింగ్ అధికారికి దేహశుద్ధ్ది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, మార్చి 22: ఎల్లారెడ్డిపల్లి, గుండారం గ్రామంలో మంగళవారం హౌసింగ్ ఆఫీసర్‌ను అని చెప్పుతూ లబ్దిదారుల నుండి డబ్బులు వ సూలు చేయడానికి ప్రయత్నించిన నకిలీ ఆఫీసర్‌ను పట్టుకోని గ్రామస్తులు దేహశుద్ది చేసిన సంఘటన మంగళవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్ర కారం వివరాల్లోకి వెళ్లితే ఆదిలాబాద్ జిల్లా సారాంగపూర్ మండలం బీరెల్ల గ్రా మానికి చెందిన చిన్న ప్రవీణ్ అనే వ్యక్తి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, గుం డారం, ఆర్గొండ గ్రామాల్లో ఇందిరమ్మ లబ్దిదారుల ఇంటికి తిరుగుతూ తాను విచారణ కు వచ్చానని, సక్రమంగా ఉన్నట్లు తాను చెప్పితేనే మిగతా బిల్లులు వస్తాయని చెప్పి వారి నుండి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేయడంతో అతని మాట తీరులో తేడా కన్పించడంతో సదరు లబ్దిదారుడు అతన్ని పట్టుకోని నిలదీయడంతో అతను తన గుట్టును బయటపెట్టాడు. భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని తాను ప్రేమించానని, ఖర్చుల కోసం ఈ నకిలీ ఆఫీసర్‌గా తాను అవతారం ఎత్తాల్సిన అవసరం వచ్చిందని ఆయన గ్రామస్తులతో చెప్పాడన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు నకిలీ ఆఫీసర్‌కు దేహశుద్ధ్ది చేసి పోలీసులకు అప్పగించారు.