నిజామాబాద్

పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 1: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందని, పెంచిన ధరలను భేషరతుగా ఉపసంహరించాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి సారా సురేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ మోర్తాడ్‌లో గురువారం జాతీయ రహదారిపై రాస్తారోకో, ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఒకవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా పెట్రోల్ ధరలను తగ్గించాల్సిందిపోయి, భారీ పెంచడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు నారాయణ, కిషన్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.