నిజామాబాద్

రెవెన్యూ డివిజన్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 4: ఎల్లారెడ్డిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు నాగిరెడ్డిపేట్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలోనే కొనసాగించేందు కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈనెల 6వ తేది నుంచి రిలేనిరాహార దీక్షలు నిర్వహించ తలపెట్టినట్లు అఖిల పక్ష నేతలు స్పష్టం చేశారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక బాలాగౌడ్ ఫంక్షన్ హాల్‌లోఅఖిల పక్ష నాయకులు టిడిపి మాజీ జడ్పీటిసి షేక్ గయాజుద్దిన్, శ్రీనివాస్‌రెడ్డి, చిరంజీవులు, అజ్మీరా గోవింద్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కుడుముల సత్యనారాయణ, ఏగుల నర్సింలు, గాదె సత్తయ్య, అబ్దుల్ అలీ, బిజెపి మండల పార్టీ అధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కంతి పద్మారావులు విలేఖరులతోమాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్ సర్కార్, జిల్లాల పునర్విభజనలోబాగంగా కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌ను జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. తాలుకా స్థాయి నుంచి అభివృద్దికి నోచుకోని ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంను, ఇప్పుడు రెవెన్యూ డివిజన్‌గా మార్చకుంటే ఇక జన్మలో అభివృద్దికి నోచుకోదని అన్నారు. నాగిరెడ్డిపేట్ మండలాన్ని కామారెడ్డి జిల్లానుంచి వేరు చేసి మెదక్ జిల్లాలోకలిపితే ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ రెండు మండలాల సాగు,త్రాగునీటి వరప్రదాయని ఐన పోచారంప్రాజెక్ట్ నీటి కోసం యుద్దాలు తప్పవని అన్నారు. ఎల్లారెడ్డిని రెవెన్యూ డివిజన్ సాధన కోసం అఖిల పక్షం ఆధ్వర్యంలోఈనెల 6వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలతోపాటు, అధికార పక్షం ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్ర సిఎం కెసిఆర్ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి ఎల్లారెడ్డిని రెవెన్యూ డివిజన్‌గా, నాగిరెడ్డిపేట్ మండలాన్ని కామారెడ్డి జిల్లాలోనే ఉండేలా, సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు.