నిజామాబాద్

మాతృభాష తెలుగును బ్రతికించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 7: అన్ని భాషల్లోకెల్లా గొద్దదైన తెలుగు భాషను బ్రతికించుకుని పూర్వవైభవం చేకూర్చేందుకు భాషాభిమానులు, సామాజిక, సాహితీవేత్తలంతా కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. మాతృభాష పట్ల మమకారం కలిగి ఉండడంతోనే సరిపెట్టుకోకుండా మాతృభాషకు సమాజంలో ఎనలేని గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉద్బోధించారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అధ్యక్షతన ‘తెలుగు భాషా విధానం’పై చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత, పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ వెల్చాల కొండల్‌రావు, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ పి.సాంబయ్య తదితరులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా నేటి సమాజంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకే అధిక ప్రాధాన్యత ఇస్తుండడం వల్ల మాతృభాష నిరాదరణకు గురవుతోందని వక్తలు ఆవేదన వెలిబుచ్చారు. మాతృభాషకు బదులుగా పరాయి భాషలో విద్యను బోధిస్తుండడం వల్ల పిల్లలపై కూడా తీవ్రమైన భారం పడుతోందని, తద్వారా వారు పాఠ్యాంశాలను సులువుగా ఆకళింపు చేసుకోలేకపోతున్నారని, విద్యార్థుల్లో అవగాహన రాహిత్యానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తోందని ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ పక్కదారి పట్టేందుకు కూడా ఇది ఒక కారణంగా నిలుస్తోందని విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో విద్యార్థులే క్రియాశీలమైనప్పటికీ వారు తమకు ఏమి అవసరం అనే దాని గురించి ప్రభుత్వానికి వివరించలేరని, వారి తరఫున విద్యావేత్తలు, సామాజికవేత్తలే వకాల్తా పుచ్చుకుని పిల్లలకు ఎలాంటి విద్యా విధానం అవసరమనే దానిపై సూచనలు చేయాలన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఆంగ్ల మాధ్యమంలో విద్యార్జన చేయాలనే అభిప్రాయం బలంగా నాటుకుపోయిందని, అయితే ప్రాథమిక విద్య లక్ష్యం ఉద్యోగాల కల్పన ఎంతమాత్రం కాదన్నారు. సమాజానికి సత్ప్రవర్తన కలిగిన పౌరులను అందించడమే పాఠశాల విద్య ప్రధాన లక్ష్యమని, ఇది మాతృభాషలో విద్యను బోధించినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ వర్శిటీ వి.సి సాంబయ్య మాట్లాడుతూ, తెలుగు భాష అంటే సమాజంలో చిన్నచూపు చూసే పరిస్థితి ఏర్పడిందని, ఇది దూరం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అనేక రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా మాతృభాష అయిన తెలుగులోనే విద్యాభ్యాసం కొనసాగించారనే విషయాన్ని గుర్తించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ మలివిడత ఉద్యమం విజయవంతమై ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేందుకు కూడా మాతృభాషనే ఎంతగానో దోహదపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ నేతగా మాతృ భాషలో అనర్గళంగా ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా వారిని ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేశారని అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి కన్వీనర్ వెల్చాల కొండల్‌రావు మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యా సంస్థలను పక్కనబెట్టినా, కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోనైనా తెలుగు మాధ్యమంలో విద్యా బోధన జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తద్వారా దెబ్బతిన్న విద్యా విధానాన్ని కొంతవరకైనా సంస్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తాము ప్రభుత్వం చేపట్టదల్చిన కెజి టు పిజి విద్యను వ్యతిరేకించడం లేదని, ఈ విధానం ద్వారా తెలుగు మాధ్యమంలోనూ విద్యా బోధన జరిగేలా చూడాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఉభయ భాషల్లో విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టినప్పుడే తెలుగు భాషకు పూర్వపు ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. పరిపాలన భాషగా తెలుగుకు చట్టబద్ధత కల్పించారని, అదే భాషలో విద్యా బోధన జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, వైస్ చైర్మెన్ గడ్డం సుమన, నగర మేయర్ ఆకుల సుజాత, తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ కె.యాదగిరి, తెలంగాణ వర్శిటీ మాజీ రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్, డాక్టర్ త్రివేణితోపాటు తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు ప్రభుత్వం అండ
* ఎంపి కవిత
కంఠేశ్వర్, సెప్టెంబర్ 7: తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యోగులకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరుకాపు సంఘ భవనంలో టిఎన్జీవోల జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంతో పాటు 70 వసంతాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి కవిత మాట్లాడుతూ, ఒక సంస్థ 70సంవత్సరాలు నిలబడడం అంటే మామూలు విషయం కాదని, ఈ ఘనతను టిఎన్జీవోస్ సంస్థ దక్కించుకుందన్నారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఏమంటారో తెలియని పరిస్థితి టిఎన్జీవోలకు తలెత్తుతుందని, అలాగే ఏదైనా తప్పు జరిగితే ప్రజల నుండి కూడా విమర్శలు ఎదుర్కొని నిలువాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ సమాఖ్య పాలనలో టిఎన్జీవోలు 70సంవత్సరాలు పూర్తి చేసుకుని సంస్థను నిలబెట్టుకోవడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షులు కెసిఆర్, టిఎన్జీవోల సంఘం నేతలైన దేవీప్రసాద్, స్వామినాథ్‌లతో ఉద్యమం గురించే చర్చించేవారని అన్నారు. 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఉద్యమం నీరుగారిపోయిందని భయపడడం జరిగిందని, అప్పుడే ఫ్రీజోన్ అంశం తెరపైకి రావడంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుందని, ఉద్యోగులు ఆ ఉద్యమంలో ఉద్ధృతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల భాగస్వామ్యంతో తెలంగాణ సాకారం అయిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ 15సంవత్సరాల పాటు ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేశారని, దీంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇటీవలే ఆయా శాఖల్లో క్రమబద్ధీకరించే ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఎంపి కవిత తెలిపారు. ఉద్యోగులపరంగా ఇంకా ఏవైనా పెండింగ్ సమస్యలుంటే వాటిని కూడా ముఖ్యమంత్రి పరిష్కరిస్తారనే పూర్తి నమ్మకం తనకు ఉందని, ఈ విషయంలో ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని, వారికి తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సిపిఎస్ విధానం రద్దు, కమల్‌నాథ్ కమిటీ తదితర అంశాలను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. హెల్త్‌కార్డుల అంశాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి, కార్పొరేట్ ఆసుపత్రులతో చర్చిస్తున్నారని, త్వరలోనే ఈ అంశం పరిష్కారం అవుతుందన్నారు. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే బెనిఫిట్స్‌ను వారికి ఇవ్వాల్సిందేనని, మీరు సంతోషంగా ఉంటేనే పరిపాలన సాఫీగా కొనసాగుతుందన్నారు. ఎన్‌ఆర్‌జిఎస్ అమలులో జిల్లాకు ప్రథమ స్థానం వచ్చిందని, అలాగే జిల్లా కలెక్టర్ కష్టపడి పని చేయడమే కాకుండా ఉద్యోగులు కూడా కష్టించి పనిచేసేలా ఒత్తిడి చేయడంతోనే హరితహారంలోనూ జిల్లా ముందంజలో నిలువగలిగిందని పేర్కొన్నారు. ఏదైనా కల్యాణ మండపం కానీ కమ్యూనిటీ హాల్ నిర్మించుకునేందుకు తన నియోజకవర్గ నిధుల నుండి 25లక్షల రూపాయలను అందజేస్తానని ఎంపి కవిత ప్రకటించారు. అలాగే ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా ఉద్యోగినులకు పని చేసే చోటే అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఏదేమైనా ఉద్యోగులు 42రోజుల పాటు సకల జనుల సమ్మె చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యపడిందని ఉద్యోగులను అభినందించారు. అంతకుముందు ఎంపి కవిత 70వసంతాల టిఎన్జీవోస్ వెబ్‌సైట్‌ను, లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, విజి.గౌడ్, జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత, తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టిఎన్జీవోస్ కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్, మాజీ కార్యదర్శి హమీద్, టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మార్పు’ అమలుపై నెలాఖరులోగా నివేదిక ఇవ్వాలి

* కలెక్టర్ యోగితారాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, సెప్టెంబర్ 7: గర్భిణీ స్ర్తిల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్దేశించిన మార్పు పథకం అమలు తీరుపై సమగ్ర వివరాలతో ఈ నెలాఖరులోగా నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం జాతీయ పౌష్టికాహార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్పు పథకంలో భాగంగా ఆరోగ్య లక్ష్మి అమలు తీరు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, వాక్సినేషన్, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రల పంపిణీ తదితర అన్ని వివరాలతో ఈ నెల 30వ తేదీలోగా నివేదికలు సమర్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నూటికి నూరు శాతం గర్భిణీలకు పౌష్టికాహారం, వాక్సినేషన్, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు అందజేసి సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకనూ రక్తహీనత వంటి కారణాల వల్ల 36 మంది గర్భిణీలు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించగా, అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలకు అందించే పౌష్టికాహారం, వాక్సినేషన్, మాత్రలు పంపిణీ విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ నివేదికలు రూపొందించినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని, ఇలాంటి లోటుపాట్లను ఏమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలు, శిశువులకు 68శాతం పౌష్టికాహారం అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారని, తదనుగుణంగానే పౌష్టికాహారం పంపిణీ జరిగితే మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. తప్పుడు లెక్కలతో కాలం వెళ్లదీసే పద్ధతిని విడనాడి అంగన్‌వాడి కేంద్రాల ద్వారా నిర్దేశించిన మేరకు గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందజేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. మార్పు పథకం పకడ్బందీగా అమలైతే ఎంతో సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని, కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు కూడా శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడి కేంద్రం పరిధిలో గర్భసంచి ముఖద్వార పరీక్షలపై ఉదయం, సాయంత్రం గ్రామ సభలు నిర్వహించి మహిళలకు దాని గురించి తెలియజేస్తూ చైతన్యపర్చాలని సూంచారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, ఐసిడిఎస్ పి.డి మోహన్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు.
* కలెక్టర్ యోగితారాణా
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, సెప్టెంబర్ 7: గర్భిణీ స్ర్తిల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉద్దేశించిన మార్పు పథకం అమలు తీరుపై సమగ్ర వివరాలతో ఈ నెలాఖరులోగా నివేదికలు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం జాతీయ పౌష్టికాహార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మార్పు పథకంలో భాగంగా ఆరోగ్య లక్ష్మి అమలు తీరు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, వాక్సినేషన్, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రల పంపిణీ తదితర అన్ని వివరాలతో ఈ నెల 30వ తేదీలోగా నివేదికలు సమర్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నూటికి నూరు శాతం గర్భిణీలకు పౌష్టికాహారం, వాక్సినేషన్, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు అందజేసి సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తున్నప్పటికీ జిల్లాలో ఇంకనూ రక్తహీనత వంటి కారణాల వల్ల 36 మంది గర్భిణీలు మృతి చెందడం ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తూ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించగా, అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలకు అందించే పౌష్టికాహారం, వాక్సినేషన్, మాత్రలు పంపిణీ విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ నివేదికలు రూపొందించినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని, ఇలాంటి లోటుపాట్లను ఏమాత్రం ఉపేక్షించబోమని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో అంగన్‌వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలు, శిశువులకు 68శాతం పౌష్టికాహారం అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారని, తదనుగుణంగానే పౌష్టికాహారం పంపిణీ జరిగితే మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. తప్పుడు లెక్కలతో కాలం వెళ్లదీసే పద్ధతిని విడనాడి అంగన్‌వాడి కేంద్రాల ద్వారా నిర్దేశించిన మేరకు గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందజేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. మార్పు పథకం పకడ్బందీగా అమలైతే ఎంతో సత్ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని, కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు కూడా శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రతి అంగన్‌వాడి కేంద్రం పరిధిలో గర్భసంచి ముఖద్వార పరీక్షలపై ఉదయం, సాయంత్రం గ్రామ సభలు నిర్వహించి మహిళలకు దాని గురించి తెలియజేస్తూ చైతన్యపర్చాలని సూంచారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు తయారు చేసిన పౌష్టికాహారాన్ని కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, ఐసిడిఎస్ పి.డి మోహన్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ పాల్గొన్నారు.

* ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
ఆర్మూర్, సెప్టెంబర్ 7: ఆర్మూర్ రూరల్ మండలం ఏర్పాటు కావడం ఖాయమని, ఈ విషయంలో ప్రజలు ఆందోళనలు పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆర్మూర్‌లోని రోడ్లు, భవనాల శాఖ అతిథిగృహంలో ఆయన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మూర్ అర్బన్‌తో పాటు ఆర్మూర్ రూరల్ మండలం ఉంటుందని, టెక్నికల్ ఇబ్బందులు తలెత్తకుంటే ఆలూర్ మండలం కూడా ఏర్పడుతుందని ఆయన అన్నారు. తాను ఇదివరకే ఆర్మూర్ రూరల్ మండలం ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదించానని, ప్రజలు భయపడవద్దని అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఆర్మూర్ రూరల్ మండలం ఏర్పాటు విషయంలో ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేయడం సమంజసం కాదన్నారు. ఆర్మూర్ పట్టణ సుందరీకరణ విషయంలో కూడా కొంతమంది అకారణంగా రాద్ధాంతం చేస్తున్నారని, ఎవరికి ఇబ్బంది కలుగకుండా డివైడర్ నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వ్యాపారులు, ప్రజల అభిప్రాయం మేరకు డివైడర్ కడతామని అన్నారు.
అభివృద్ధిపై సిఎం కెసిఆర్‌తో కలిసి రావాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు సిఎంతో కలిసి రావాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. అందువల్లే కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారని, కాళేశ్వరం పూర్తయితే నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సైతం నీరు వస్తుందని ఆయన చెప్పారు.
ఇలాంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంతో కలిసి రాకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కాదు, డైమండ్ తెలంగాణ ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణ సుందీకరణపై ప్రజలు, వ్యాపారులు సహకరించాలని, సుందరీకరణ జరిగితే వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీటిసి సాందన్న, ఎంపిపి పోతు నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు సంజయ్‌సింగ్ బబ్లూ, ఖాందేశ్ శ్రీనివాస్, సుంకరి రంగన్న, రమాకాంత్, పోల మధుకర్, రాము, జోశ్రీను, కలిగోట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ మొదలైన ర్యాగింగ్ భూతం
* విద్యార్థిని ఆత్మహత్యాయత్నంతో వెలుగు చూసిన నిజాలు
* విద్యార్థులు, వార్డెన్‌పై కేసు నమోదు
బోధన్, సెప్టెంబర్ 7: బోధన్ పట్టణంలో మళ్లీ ర్యాగింగ్ భూతం మొదలయ్యింది. పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలల్లో వెలుగు చూసిన విద్యార్థిని ఆత్మహత్యా ఘటనతో ఈ వ్యవహారం బయట పడింది. దాంతో పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించి సదరు విద్యార్థినిని వేధించి అవమారపరిచిన ముగ్గురు విద్యార్థులు, హాస్టల్ వార్డెన్, ఓ లెక్చరర్‌పై బుధవారం కేసు నమోదు చేశారు. గతంలో కేవలం సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ చేసేవారు. కానీ నేడు జూనియర్, సీనియర్ తేడా లేకుండా అదే కళాశాలల్లో చదువుతున్న తోటి విద్యార్థినిని మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన విద్యార్థులు కటకటాలు లెక్కించాల్సి వస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థిని ఘటన వెలుగు చూడటంతో హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి పట్టణంలో ర్యాగింగ్ అనేది కనిపించకటుండా పోయింది. గతంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ర్యాగింగ్ ఘటన వెలుగు చూడటంతో పోలీసులు అప్రమత్తమై అన్ని విద్యాసంస్థలో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ విధంగా ప్రతీ ఏటా సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ర్యాగింగ్‌కు పాల్పడితే ఎటువంటి శిక్షలు పడతాయో వివరిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అవగాహన సదస్సులు నిర్వహించక పోవడంతో విద్యార్థులు మళ్లీ ర్యాగింగ్ భూతానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల యాజమాన్యాలు సైతం ఈ ర్యాగింగ్ విషయంలో తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు చట్టాలు, శిక్షల గురించి తెలియచేయక పోవడం వల్లనే మళ్లీ ఇక్కడ ఘటనలు పునరావృతమయినట్లు తెలుస్తోంది. ఇక్కడి ప్రైవేటు కళాశాలల్లో జరిగిన ఘటనతో బుధవారం బోధన్‌లో విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. పోలీసు అధికారులు స్పందించి విద్యాసంస్థలలో ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కళాశాలల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

అధికారులపై ఆర్డీఓ ఆగ్రహం
మాక్లూర్, సెప్టెంబర్ 7: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యారని ఆర్డీఓ యాదిరెడ్డి మాక్లూర్ మండల ఎంపిడిఓ సక్రియానాయక్, తహశీల్దార్ భాస్కర్, ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిపించకపోవడాన్ని ఆర్డీఓ తీవ్రంగా పరిగణిస్తూ అధికారులపై ఆగ్రహం ప్రదర్శించారు. మహిళల ఆత్మగౌరవంతో పాటు ప్రజలు రోగాల బారినపడకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాల కోసం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తోందని అన్నారు. అయితే ప్రజల్లో సరైన అవగాహన కల్పించని కారణంగా ఐఎస్‌ఎల్ నిర్మాణాల కోసం ప్రజలు ముందుకు రావడం లేదని తెలుస్తోందన్నారు. ఇకపై నిర్లక్ష్యానికి తావు లేకుండా అవసరమైతే ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనూ మరుగుదొడ్లను నూటికి నూరు శాతం నిర్మించకపోవడాన్ని తప్పుబట్టారు. నిస్తేజాన్ని విడనాడి మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పక్షం రోజుల్లో లక్ష్యాన్ని సాధించకపోతే చర్యలు తప్పవని ఆర్డీఓ హెచ్చరించారు.

రెండో రోజు కొనసాగిన బిఎస్‌ఎన్‌ఎల్ అధికారుల ధర్నా
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 7: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు జిల్లా కేంద్రంలోని సంచార భవన్ ఎదుట చేపట్టిన ధర్నా బుధవారం నాటికి రెండవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్ అధికారుల సంఘం ప్రతినిధి రాజాకృష్ణ మాట్లాడుతూ, టెలికాం అధికారుల పట్ల యాజమాన్యం అవలంభిస్తున్న అసంబద్ధ వైఖరిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఎ, ఎన్‌ఇఎ, ఎఐబిఎస్, ఎస్‌ఎన్‌ఎల్‌ఇఎ సంఘాలు కలిసి సంయుక్తంగా ధర్నా చేపట్టాయని అన్నారు. పదవీ విరమణ సమయంలో లభించే బెనిఫిట్స్‌ను పొడిగిస్తూ, ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తించే వారికి పది నుండి పనె్నండు సంవత్సరాలు గడిచినా పదోన్నతులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు తక్షణమే పెంచాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 27, 28, 29తేదీలలో మరోమారు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ ధర్నాలో ఉద్యోగుల సంఘం నాయకులు శంకర్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, రవికుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 17 విద్రోహ దినమే
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 7: తెలంగాణ విలీన దినం సెప్టెంబర్ 17 ఎంతమాత్రం కాదని, ఇది ముమ్మాటికీ విద్రోహ దినమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఏకతాటిపైకి చేరి ఉద్యమం ప్రారంభించారని గుర్తు చేశారు. నిజాం నవాబు పాలనలో ప్రజలు అనేక నిర్బంధాలకు, అవమానాలకు గురయ్యారని ఆయన వెల్లడించారు. సాయుధ పోరాటంతో తోక ముడిచిన నిజాంను తాము లొంగదీసుకున్నామని, అందుకే అది విమోచన దినమంటూ పలువురు చరిత్రకు వక్రభాష్యాలు చెప్పడం విడ్డూరమని అన్నారు.

కొనసాగుతున్న నీటి విడుదల
మోర్తాడ్, సెప్టెంబర్ 7: చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల డపథకం ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్పల్లిలో గల చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్టు నుండి నాలుగు సిస్టర్న్‌లకు విడతల వారీగా నీటిని అందిస్తున్నారు. మోర్తాడ్ మండలం ఒడ్యాట్ సిస్టర్న్‌లో పడుతున్న గోదావరి జలాలు హాసాకొత్తూర్, ఒడ్యాట్, మోర్తాడ్‌లోని ముసలమ్మ చెరువులకు చేరుతున్నాయి.
ఒకవైపు వర్షాలు కురియక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో చెరువుల నుండి నీటిని విడుదల చేశారు. ఇదే సమయంలో హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం జలాలు చెరువుల్లోకి చేరుతుండడంతో ఖరీఫ్ పంటలు గట్టెక్కినట్టేనని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి విద్యార్థి హెల్మెట్ వాడాలి
వినాయక్‌నగర్, సెప్టెంబర్ 7: లైసెన్సులు కలిగి ఉండి ద్విచక్ర వాహనాలు నడిపే విద్యార్థులు విధిగా శిరస్త్రాణాలు ధరించాలని ట్రాఫిక్ సిఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ నరేష్‌లు విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కాలేజీ వద్ద బుధవారం ట్రాఫిక్ పోలీసు అధికారులు విద్యార్థులకు హెల్మెట్ల వాడకంపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెల్మెట్ల తప్పనిసరిగా చేస్తున్నామని చెప్పారు.