నిజామాబాద్

ఇక రైలుకూత లేనట్టేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 9: మోర్తాడ్‌కు రైలు కూత ఇప్పట్లో లేనట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు గడిచిన జూలై నుండే రైలును నడిపిస్తామని రైల్వే శాఖ హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం మోర్తాడ్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆర్మూర్-నిజామాబాద్‌ల మధ్య ట్రాక్‌తో పాటు ఇతరాత్ర పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం మోర్తాడ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థమై ఫుట్‌బోర్డు సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి గడిచిన ఏప్రిల్ మాసంలోనే ప్రత్యేక సేఫ్టీ బృందం మోర్తాడ్ వరకు పూర్తిస్థాయి రైలు నడిపింది. అత్యంత వేగంతో రైలు పట్టాలని నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలను కూడా పరిశీలించి, పనితీరును మెచ్చుకున్నారు. ప్రస్తుతం కరీంనగర్-జగిత్యాల్ మధ్య నడుస్తున్న ఫ్యాసింజర్ రైలు మోర్తాడ్ వరకు పొడిగిస్తామని, జూన్ 2016లో దీనిని ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి మోర్తాడ్‌వాసులు రైలు కూత కోసం ఎదురు చూస్తునే ఉన్నారు. గత రైల్వే బడ్జెట్‌లో మోర్తాడ్ వరకు రైలు పొడగింపుపై ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాలేదు. బడ్జెట్‌లో రైలు పొడగింపునకు ఆమోదం పడితేనే, కొత్త రైలు వచ్చే అవకాశం ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు. 2017జూన్ కల్లా నిజామాబాద్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తవుతాయని ఇటీవలే రైల్వే శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా నేతలు కూడా ప్రకటించారు. ఆ పనులు పూర్తయితే గానీ ఈ ప్రాంతంలో రైలు నడిచే అవకాశం ఉండకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. మొదట ప్రతిపాదించిన ప్రకారం 2014 జూన్ కల్లా మోర్తాడ్ వరకు రైలు రావాల్సి ఉన్నప్పటికీ, ప్రతి యేటా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం మోర్తాడ్‌కు రైలు రాకలో మరింత జాప్యం ఏర్పడవచ్చని, నిజామాబాద్ వరకు రైల్వే లైన్ పూర్తయితేనే మోర్తాడ్‌కు రైలు కూత వినిపించే అవకాశం ఉందని నిఫుణులు చెబుతున్నారు. మొత్తానికి నిజాం కాలంలో సర్వేకు నోచుకున్న నాటి నుండి రైలు కూత కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత వాసులకు రైలు రాక ఎండమావిలాగే కనిపిస్తోంది.