నిజామాబాద్

క్షయ నివారణకు కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: క్షయ వ్యాధి నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీలతో కలిసి నగర మేయర్ ఆకుల సుజాత జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి నుండి ఈ ర్యాలీకి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గాంధీచౌక్, బస్టాండ్, ఖలీల్‌వాడిల మీదుగా ఈ ర్యాలీ న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది. నర్సింగ్ విద్యార్థినులు, ఎఎన్‌ఎంలు టి.బి రూపంలో మానవహారంగా ఏర్పడి ఈ వ్యాధి పట్ల అవగాహనను పెంపొందించే ప్రయత్నం చేయడం చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, నిర్లక్ష్యం కారణంగానే ఈ వ్యాధి ప్రబలుతోందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా క్షయ వ్యాధిగ్రస్తులు 8.7మిలియన్లు ఉంటే, ఒక్క భారతదేశంలోనే ఈ సంఖ్య 2.6మిలియన్లుగా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. మన దేశంలో టి.బిని నియంత్రిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధిని చాలావరకు నిర్మూలించినట్లు అవుతుందని అన్నారు. సరైన చికిత్స తీసుకుంటే టి.బి వ్యాధి నయం అవుతుందని, వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం వాటిల్లే అవకాశాలూ లేకపోలేదని పేర్కొన్నారు. టి.బి నియంత్రణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఈ వ్యాధిని సమాజం నుండి పూర్తిగా పారద్రోలేందుకు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు, నివారణ మందులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నూటికి నూరుశాతం నయమవుతుందని, లేనిపక్షంలో ఒకరి ద్వారా మరొకరికి సోకే ప్రమాదం ఉందన్నారు. కాగా, టి.బి రోగులకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ యోగితారాణా హెచ్చరించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, క్షయ వ్యాధిని నియంత్రించేందుకు ప్రజలందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా గుర్తించాలన్నారు. టి.బి వ్యాధి ఎవరికైనా సోకేందుకు ఆస్కారం ఉంటుందని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సరైన కాల వ్యవధి వరకు వైద్యుల సూచనలను పాటిస్తూ క్రమం తప్పకుండా చికిత్సలు చేయించుకుంటే టి.బి వ్యాధి నుండి బయటపడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టి.బి నియంత్రణ అధికారి డాక్టర్ దినేష్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ ప్రభాకర్, వైద్యులు సురేష్‌కుమార్, తిరుపతిరావు, నాగరాజు, జిల్లా టిబి, హెచ్‌ఐవి సెంటర్ కోఆర్డినేటర్ రవి పాల్గొన్నారు.