నిజామాబాద్

మెడికల్ కళాశాలలో ఎంసిఐ బృందం తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 22: నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని అన్ని విభాగాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం గురువారం సందర్శించి పరిశీలించింది. జిల్లా మెడికల్ కళాశాలకు నాల్గవ సంవత్సరానికి సంబంధించిన అనుమతితో పాటు వచ్చే సంవత్సరం అదనపు మెడికల్ సీట్ల మంజూరీ కోసం స్థానికంగా నెలకొని ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకునేందుకు ఎంసిఐ బృందం హాజరై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ బృందంలో తమిళనాడులోని కోయంబత్తూర్ మెడికల్ కళాశాల ఫార్మా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శాంతి, మహారాష్టల్రోని నాగ్‌పూర్ కళాశాల హెచ్‌ఓడి డాక్టర్ పిపి.జోషి, కర్నాటకలోని బెల్గం మెడికల్ కళాశాల హెచ్‌ఓడి డాక్టర్ శశికాంత్ నికమ్‌లు హాజరయ్యారు. తనిఖీలో భాగంగా ముందుగా జిల్లా మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జిల్లా జనరల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, గైనిక్, పిడియాట్రిక్ వార్డు, సర్జికల్, టిబి, బ్లడ్‌బ్యాంక్, రక్త పరీక్షల ల్యాబ్, మెడిసిన్, ఆపరేషన్ థియేటర్, ఫార్మా కాలేజీతో పాటు అన్ని విభాగాలను పరిశీలించారు. ఎంసిఐ బృందం జిల్లా మెడికల్ కళాశాలకు అనుమతి మంజూరు చేయడంలో భాగంగా ఈ పర్యటనకు రావడం జరిగిందని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర తెలిపారు.
మెడికల్ కళాశాలకు ఇదే చివరి సంవత్సరం తనిఖీ పూర్తి కావాల్సి ఉందన్నారు. దీంతో అనాటమి, మైక్రోబయాలోజీ, బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథోలాజీ, ఫార్మా కాలోజీ, మెడిసిన్‌తో పాటు ప్రాక్టికల్స్, మ్యూజియం, లెక్చరర్స్ గ్యాలరీ, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు మెడికో విద్యార్థుల హాస్టల్‌లోని గదులను, వసతులను తనిఖీ బృందం పరిశీలించడం జరిగిందన్నారు.
ఆయా విభాగాలకు చెందిన ప్రొఫెసర్స్, హెచ్‌ఓడి డాక్టర్ ముకుంద్‌రావు, డాక్టర్ బన్సిలాల్, డాక్టర్ గోపాల్‌సింగ్, డాక్టర్ శ్రీనివాస్‌రావు, డాక్టర్ విశాల్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ రాజేంద్రప్రసాద్‌లకు ఎంసిఐ అధికారుల బృందం ప్రత్యేకంగా సబ్జెక్‌పై విచారణ కొనసాగించారు. అదేవిధంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సూపరింటెండెంట్‌పై బృందం సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని, చివరి రోజు మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న నవీపేట పిహెచ్‌సి, అర్సపల్లి అర్బన్ హెల్త్ సెంటర్స్‌తో పాటు కొన్ని విషయాలపై పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతారని అన్నారు. పరిశీలన అనంతరం పూర్తి నివేదికను తయారు చేసి ఎంసిఐకు సమర్పించడం జరుగుతుందని బృందం ప్రతినిధులు తెలిపారు.