నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 22: జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న భారీనీటి పారుదల శాఖ పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం గత రెండేళ్ల కాలంగా నీరు లేక బోసిపోయి ఉంది. నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరీజీలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి కొత్త నీరు ఇప్పుడిప్పుడే వచ్చిచేరుతోంది. సెప్టెంబర్ 22నుండి ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం వల్ల ప్రాజెక్ట్ 12వరదగేట్ల వద్ద కొత్తనీరు కన్పిస్తుంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం వెయ్యి ఏడు క్యూసెక్కుల వరద నీరు వస్తుందని నిజాంసాగర్ ప్రాజెక్ట్ డిప్యూటిఇఇ సురేష్‌బాబు తెలిపారు. మూడు రోజులుగాకురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్ట్‌లోకి స్వల్పంగా నీరు వచ్చి చేరుతోందని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00అడుగులు కాగా, 1367.00అడగుల నీరు ప్రస్తుతం ఉంది. 17.802టిఎంసీల సామార్ధ్యం గల ప్రాజెక్ట్‌లో 0.85టిఎంసీల నీరు మాత్రం నిలువ ఉందని డిఇ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతం అయిన మెదక్ జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్‌లోకి 4,187క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందిని అన్నారు. సింగూర్ జలాశయంలో ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రాజెక్ట్ నీటి మట్టం పెరుగుతోందని అన్నారు.
శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరదనీరు
బాల్కొండ: బంగాళాఖాతంలోని ఉపరితల ఆవరణ కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాలు, గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలకు మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు జలాలు తోడు కావడంతో రిజర్వాయర్‌లోకి 27వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు.