నిజామాబాద్

రూ. 200కోట్లతో చేప పిల్లల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, అక్టోబర్ 1: దేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 200కోట్ల రూపాయల విలువైన చేప పిల్లలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 46వేల చిన్నపెద్ద చెరువులు, 78రిజర్వాయర్లు ఉన్నాయని, వీటి విస్తీర్ణం 5.67కోట్ల హెక్టార్లు ఉంటుందన్నారు. ఈ చెరువులు, రిజర్వాయర్లలో 3.20కోట్ల చేప పిల్లలను ఈసారి వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్రంలో మత్స్యకార్మికుల ఎదుర్కొన్న ఇబ్బందులను దూరం చేస్తూ, బంగారు భవిష్యత్‌ను అందించేందుకు పెద్దపీఠ వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు ఒక్కో చెరువులో కేవలం 12,500రూపాయలు మాత్రమే మత్స్యకారులకు సబ్సిడీపై అందజేసేవని, సమైక్య రాష్ట్రంలోని 23జిల్లాలకు గాను కేవలం 5కోట్ల చొప్పున మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరంలోనే రాష్ట్రంలోని 10జిల్లాల్లో చేప పిల్లల ఉత్పత్తికి 100కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం మరో 150కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీంతో పాటు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ఉండేందుకు గాను పూర్తి హక్కులను మత్స్యకారులకే అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు. చెరువుల్లో పెరిగిన చేపలను వారికి సరైన గిట్టుబాటు ధర లభించే చోటనే విక్రయించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రవాణా సౌకర్యం కోసం 75శాతం సబ్సిడీపై టూ వీలర్స్, ఫోర్‌వీల్ వాహనాలను అందజేయడం జరుగుతుందన్నారు. తెప్పలు, వలలు, సైకిళ్లు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మండలాని ఒకటి చొప్పు చేపల విక్రయ కేంద్రాల నిర్మాణం కోసం 18లక్షల చొప్పున మంజూరీ చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఏ జిల్లా మత్స్యకారులు, ఆ జిల్లాలోనే ఉత్పత్తి చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 250మత్స్య సహకార సంఘాల భవనాలను నిర్మించడం జరిగిందని, చేపల వేటను నమ్ముకుని జీవనం వెళ్లదీస్తున్న మత్స్యకార్మికులు వలసలు వెల్లకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే గొర్రెలు, మేకల పెంపకందారులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయంతో 60శాతం సబ్సిడీపై ఎన్‌సిడిసి ద్వారా 400కోట్ల రూపాయల రుణాలు అందించడం జరిగిందన్నారు. అలాగే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాడిపంటల సాగుకు కూడా ప్రభుత్వం భారీగా రాయితీ కల్పిస్తూ ఆదుకోవడం జరిగిందన్నారు. విజయ డైరీ ద్వారా సేకరిస్తున్న పాల సేకరణలో భాగంగా 4రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, దీంతో సర్కార్‌పై 70కోట్ల భారం పడుతోందన్నారు. కూరగాయల పెంపకం కోసం బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 200రైతుల చొప్పున సమావేశం ఏర్పాటు చేసి రైతులను చైతన్యపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జనాభా లెక్కల ప్రకారం ప్రజలకు ఎంత మేర ఉత్పత్తులు అవసరం అవుతాయో అంతకు మించి కురగాయలను పండించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు.

పిడుగుపాటుకు
ఇద్దరు మృతి
దోమకొండ, అక్టోబర్ 1: దోమకొండ మండలంలోని బీబీపేట్ గ్రామ చెరువు సమీపంలోని ఉప్పర్‌పల్లి శివారులో పిడుగు పడి ఇద్దరు గొర్రెల కాపారులు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం జరిగింది. ఎస్‌ఐ రవిబాబు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రోజులాగే మేకలను గ్రామ శివారులోకి మేపడానికి కాపారులు జొన్నల నర్సింలు (46), కంకరి రామస్వామి (55) వెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి.
భారీ వర్షం పడుతుండడంతో చింతచెట్టు వద్ద మేకలను ఆపి వారు నిల్చున్నారు. ఇంతలోనే పిడుగు పడడంతో నర్సింలు, రామస్వామితో పాటు 40 మేకలు మృత్యువాత పడ్డాయి. వర్షం తగ్గిన తర్వాత అటువైపు వెళ్లిన కొందరు వ్యక్తులు మృతదేహాలను చూసి గ్రామస్థుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. నర్సింలుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామస్వామికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కామారెడ్డి ఏరియాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రవిబాబు తెలిపారు.