నిజామాబాద్

నాలా పేరిట భారీగా నిధుల కైంకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, అక్టోబర్ 4: నందిపేట మండల కేంద్రానికి చెందిన విఆర్‌ఓ కిషన్‌గౌడ్ నాలా పేరిట ఆర్డీఓ ఫోర్జరీ సంతకంతో గృహ నిర్మాణదారుల నుండి లక్షలాది రూపాయలు కాజేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు పలువురు ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ యాదిరెడ్డి విచారణ జరిపారు. సదరు విఆర్‌ఓపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్డీఓ కలెక్టర్‌కు నివేదించారు. వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రంలో అంజయ్య అనే వ్యక్తి గృహ నిర్మాణం చేపట్టాడు. అయితే పక్కనే ఉన్న మరో వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అసైన్‌మెంట్ స్థలంలో నిర్మాణం జరుపుతుంటే ఎలా అనుమతించారంటూ అధికారులను నిలదీశాడు. అయితే అంజయ్య నాలా కన్వర్షన్ కింద ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాడంటూ విఆర్‌ఓ కిషన్‌గౌడ్ ఆర్డీఓ సంతకంతో కూడిన పత్రాన్ని ఫిర్యాదుదారుడికి చూపించాడు. దీంతో అనుమానం వచ్చిన ఫిర్యాదుదారుడు ఆర్డీఓను కలిసి ఆరా తీయడంతో అసలు భాగోతం బయటపడింది. తాను నాలా కన్వర్షన్ కోసం సంతకం చేయలేదని ఆర్డీఓ పేర్కొన్నాడు. మంగళవారం ఆర్డీఓ యాదిరెడ్డి స్వయంగా నందిపేటకు చేరుకుని తహశీల్ కార్యాలయంలో అంజయ్య గృహ నిర్మాణం ఫైలును పరిశీలించారు. నాలా కన్వర్షన్ పేరిట విఆర్‌ఓ సృష్టించిన డాక్యుమెంట్ కూడా నకిలీదని, దానిపై తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు ఆర్డీఓ గుర్తించారు. ఇదే తరహాలో రెండు సంవత్సరాల నుండి 33మంది గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న వారి వద్ద నుండి ఒక్కొక్కరి నుండి 5వేలు మొదలుకుని 10వేల వరకు డబ్బులు తీసుకుంటూ ఆర్డీఓ ఫోర్జరీ సంతకంతో నాలా కన్వర్షన్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆర్డీఓ దృష్టికి వచ్చింది. విఆర్‌ఓ కిషన్‌గౌడ్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తానని ఆర్డీఓ తెలిపారు.