నిజామాబాద్

శ్రీరాంసాగర్‌లోకి వరదనీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, అక్టోబర్ 7: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో పాటు మహారాష్టల్రోని ప్రాజెక్టుల మిగులు జలాలు తోడు కావడంతో లక్షా 20వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో 1091.00అడుగులు 90టిఎంసిల సామర్థ్యం గల రిజర్వాయర్‌లో అదే స్థాయిలో నీటి నిల్వలను కొనసాగిస్తూ ప్రధాన కాల్వ అయిన కాకతీయకు 5వేల క్యూసెక్కులు, సరస్వతికి 1000, లక్ష్మి కెనాల్‌కు 100, వరదకాల్వకు 18000క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.