నిజామాబాద్

కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 13: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహాంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సబ్సిడి విషయంపై గురువారం హైద్రబాద్‌లోని సచివాలయం ముందు బిజెపి ధర్నా చేపట్టడం రాజకీయ లబ్దికోసమేనని విమర్శించారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో కోటి ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. బిజెపి ధర్నా చేస్తే రైతులు నమ్మే స్థితిలో లేరనే విషయాన్ని గుర్తించాలన్నారు. గత ప్రభుత్వాల్లో విత్తనాల కోసం రైతులు బారులు తీరే వారని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక సకాలంలో విత్తనాలను అందిస్తున్నామన్నారు. ఫర్టిలైజర్‌తో పాటు రైతులకు సంబంధించిన పరికరాలు, ట్రాక్టర్లపై సబ్సిడి అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పావలవడ్డీ రుణాలతో పాటు రైతులు పండించిన ధాన్యం నిల్వ కోసం గోదాంల నిర్మాణం కూడా చేపట్టడం జరిగిందన్నారు. కరెంట్ కోతలు లేకుండా లక్షల కోట్లు ఖర్చు చేసి రైతుల కోసం 9గంటల పాటు నిరంతర కరెంట్ అందిస్తామన్నారు. శాశ్విత కరువు నివారణ కోసం ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా కొనసాగుతుందన్నారు. మిషన్ కాకతీయతో పాటు తదితర పథకాలన్ని రైతులతో పాటు ప్రజలకు ఎంతోగానో మేలు చేస్తాయన్నారు. ఫాలీహౌస్ వేసుకునే రైతులకు 75శాతం సబ్సిడి అందిస్తున్నామన్నారు. గిరిజనులకు, దళితులకు వందశాతం సబ్సిడి అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని త్వరలో చూపిస్తామని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రాయితీలో అగ్రస్థానంలో ఉందన్నారు. రాజకీయ లబ్దికోసం ధర్నాలు చేయడం తగదని సూచించారు. రైతులకు ఇన్‌ఫూట్ సబ్సిడి అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, మున్సిపల్ చైర్మన్ సుష్మ, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, జుకంటి మోహన్‌రెడ్డి, నాయకులు గోపిగౌడ్, మదుసుధన్‌రావు, శేఖర్, ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు భూంరెడ్డి, ఆనంద్, రవి, చాట్ల రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, అంజాద్, లక్ష్మీనారాయణ, ప్రసాద్, తదితరులున్నారు.