నిజామాబాద్

సైనికుల త్యాగాలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, అక్టోబర్ 23: దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో ప్రతీకూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్నారని, వారి త్యాగాలు మరువలేనివని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ జిల్లా డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జవాన్లకు కళాకారుల సలాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలను కళ్లకు కడుతూ కళాకారులు ఆకట్టుకునే రీతిలో ప్రదర్శనలు ఇచ్చారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు వారిలోని ప్రతిభను చాటుతూ ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈగ గంగారెడ్డి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత్‌కు, పాకిస్థాన్‌కు మధ్యన ఎంతో అగాధం ఏర్పడి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అన్నారు. దాయాది దేశమైన పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ, వారిని భారతదేశంపై ఉసిగొల్పుతోందని, అనునిత్యం మారణహోమం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో, పంజాబ్‌లో ఉగ్రవాదుల రెచ్చిపోతున్నారని, సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ ఉన్మత్తులై వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఏ మూలన ఎలాంటి ఉగ్రవాద దుశ్చర్య జరిగినా దానికి పాకిస్థానే నైతిక బాధ్యత వహించేలా అన్ని దేశాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నందున ఆ దేశంపై భారత్ యుద్ధం ప్రకటించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఒకవేళ యుద్ధం వస్తే దేశ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కేంద్రానికి అండగా ఉంటాయని పేర్కొన్నారు.