తెలంగాణ

బాబ్లీ గేట్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి ఎగువన గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం మూసివేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ గత జూలై 1వ తేదీన బాబ్లీకి చెందిన 14గేట్లను పైకి ఎత్తగా, తిరిగి ప్రస్తుతం వాటిని మూసివేసి గోదావరి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. సిడబ్ల్యుసి ప్రతినిధి సమక్షంలో ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో బాబ్లీ గేట్లను కిందకు దించారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పూజలు నిర్వహించిన అనంతరం ఒక్కో గేటును విడతల వారీగా కిందకు దించుతూ నీటి ప్రవాహాన్ని దిగువ గోదావరిలోకి నిలిపివేశారు. కేంద్ర జల సంఘం ప్రతినిధి శ్రీనివాసులు సమక్షంలో ఎస్సారెస్పీ ఎస్‌ఇ సత్యనారాయణ, ఇ.ఇ రామారావు, డి.ఇ జగదీష్, మహారాష్టల్రోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ ఇ.ఇ లవరాలే, డి.ఇ పొక్యాల పర్యవేక్షణలో ఒక్కోటిగా 14 గేట్లను కిందకు దించారు. బాబ్లీ గేట్లు తిరిగి వచ్చే ఏడాది 2017 జూన్ 30వ తేదీన తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో ప్రస్తుతం ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండడమే కాకుండా, బాబ్లీ వద్ద కూడా గోదావరి జలకళతో ఉట్టిపడుతోంది. అయితే బాబ్లీ ప్రాజెక్టును శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతంలోనే నిర్మించడం, ఈ బ్యారేజీకి రివర్స్ స్లూయిస్ గేట్లను అమర్చిన కారణంగా ఎస్సారెస్పీలో ప్రస్తుతం నిలువ ఉన్న నీటిని కూడా మహారాష్ట్ర వినియోగించుకునేందుకు ఆస్కారం ఉందని, అదే జరిగితే ఎస్సారెస్పీలో నీటి నిల్వలు త్వరితగతిన ఖాళీ అయిపోతాయనే ఆందోళన ఒకింత వ్యక్తమవుతోంది. బాబ్లీ నీటి నిలువ సామర్థ్యం 2.74టిఎంసిలుగా పేర్కొంటున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నీటిని వినియోగించుకునేలా ఈ బ్యారేజీని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. లిఫ్టుల ద్వారా సుమారు 25 నుండి 30టిఎంసిల వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉందని ఇదివరకే ఇంజనీరింగ్ అధికారులు నిర్ధారించడం జరిగింది. అంటే మహారాష్ట్ర లిఫ్టులను పూర్తిగా వినియోగిస్తే ఎస్సారెస్పీలో కనీసం 20టిఎంసిల వరకు నీరు బాబ్లీ ద్వారా నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎగువన మహారాష్టల్రోని విష్ణుపురి, గైక్వాడ్ తదితర ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండి ఉన్న దృష్ట్యా, మునుముందు భారీ వర్షాలు కురిస్తే తప్పనిసరిగా బాబ్లీ ప్రాజెక్టు గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తారని, లేనిపక్షంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు గోదావరి ప్రవాహానికి బాబ్లీ సంకెళ్లు తప్పవని స్పష్టమవుతోంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన మీదట దాదాపు నాలుగు నెలల పాటు బాబ్లీ గేట్లు తెరిచి ఉంచిన సమయంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ యేడు భారీగా వరద జలాలు వచ్చి చేరాయి. ఎస్సారెస్పీ సామర్థ్యం 1091.00 అడుగులు, 90టిఎంసిలు కాగా, ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో రిజర్వాయర్ కళకళలాడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎస్సారెస్పీలోకి 359.794టిఎంసిల వరద నీరు వచ్చి చేరడం విశేషం. ఇందులో కేవలం 50టిఎంసిల వరకే వరద కాల్వతో పాటు రిజర్వాయర్‌కు చెందిన ప్రధాన కాల్వలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మి కెనాళ్ల ద్వారా నీటిని విడుదల చేయగా, వందలాది టిఎంసిల మిగులు జలాలు వృధాగా సముద్రం పాలయ్యాయి.
chitram...
బాబ్లీ గేట్లను మూసివేయడంతో దిగువ
గోదావరిలోకి నిలిచిపోయిన నీటి ప్రవాహం