నిజామాబాద్

డబుల్ బెడ్‌రూమ్ హామీ అమలులో సర్కారు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, నవంబర్ 4: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పథకాన్ని అమలు చేయడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ విమర్శించారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తక్షణమే అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం, అనంతరం ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చడం లేదని ఆక్షేపించారు. ఇందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాల పథకమే నిదర్శనమని అన్నారు. తెరాస సర్కారు ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్‌రూమ్‌లను నిర్మించి ఇవ్వలేదన్నారు. చేసిన వాగ్దానాలను గాలికి వదిలేసి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని, కేవలం ప్రచార ఆర్భాటాలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒక్క నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోనే సుమారు 22వేల మంది అర్హులైన నిరుపేదలు పక్కా ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, తెరాస గద్దెనెక్కిన తరువాత వారిలో ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు పక్కా ఇంటిని మంజూరు చేయలేదని అన్నారు. గతేడాది 2015లో దసరా పర్వదినాన ఎంతో ఆర్భాటంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారని, ఏడాది గడిచిపోయినా ఇంతవరకు పనులను మాత్రం ప్రారంభించలేదని, తెరాస ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటితో ఈ పథకం రుజువు చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు 93కోట్ల రూపాయల నిధులను కేటాయించగా, వాటిని సైతం వెచ్చించడం లేదన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు తెరాసకు పట్టం కడితే వారి ఆశలను వమ్ము చేస్తూ, కేవలం పథకాలను వల్లె వేయడంతోనే కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. నిధుల లేమిని సాకుగా చూపుతున్న కెసిఆర్, తన క్యాంపు కార్యాలయం, అసెంబ్లీకి కొత్త భవనం, ఫాంహౌజ్ ఆధునికీకరణ కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో తెరాసకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.