నిజామాబాద్

నిజాం సుగర్స్ స్వాధీనంపై సర్కారు తర్జన భర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, నవంబర్ 6:నిజాంచక్కెర కర్మాగారాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయమై సర్కారు ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఈ కర్మాగారాలపై ప్రైవేటు యాజమాన్యం వందకోట్లకు పైగా అప్పులు తీసుకు రావడంతో నేడు వాటిని ఎవరు చెల్లించాలన్నది అంతుచిక్కడం లేదు. ప్రైవేటు యాజమాన్యం చక్కెర కర్మాగారాలను ప్రభుత్వానికి అప్పగించాలంటే ముందుగా ఈ అప్పుల సంగతి తేలాల్సి ఉంది. ప్రభుత్వం కర్మాగారాలను స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వానికి, డేల్టా యాజమాన్యానికి నడుమ చర్చలు జరుగాలి. అప్పులు, ఇతర విలువైన భూముల లెక్కలు తేలాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అటువంటి చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ కర్మాగారాల విషయంలో సర్కారుపై ఒత్తిడి మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఇచ్చిన వాగ్ధానం ప్రకారం ఈ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సర్కారులో సుముఖత కనిపిస్తున్నా కర్మాగారాల అభివృద్ధి కోసం ప్రైవేటు యాజమాన్యం వివిధ బ్యాంకుల ద్వారా తెచ్చిన అప్పులు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించబడుతున్న బోధన్, మెదక్, మెట్‌పల్లి చక్కెర కర్మాగారాలు, డిస్టిల్లరీ యూనిట్లను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుని సహకార రంగంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై గత ఏడాది కాలంగా అన్ని కోణాల నుండి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ కర్మాగారాల విషయంలో మొదటి నుండీ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో బాగంగా గత ఏడాది క్రితం ఇక్కడి రైతులను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నటువంటి సహకార చక్కెర కర్మాగారాలను పరిశీలించేందుకై సర్కారు అక్కడికి పంపించి సహకార రంగం పై వారికి అవగాహన కల్పించింది. కానీ బోధన్ రైతులు మాత్రం ఇక్కడి చక్కెర కర్మాగారాన్ని సహకార రంగంలో నడిపించేందుకు విముఖత వ్యక్తం చేయడంతో సర్కారు ఫ్యాక్టరీల విషయం పై కొంత వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. గత పదకొండు నెలలుగా ప్రైవేటు యాజమాన్యం కర్మాగారాలలో లే ఆఫ్ ప్రకటించి కార్మికులకు వేతనాలు చెల్లించక పోవడంతో సర్కారు పై మరింత ఒత్తిడి పెరిగింది. ఎన్నికల వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఒకవైపు ప్రతిపక్షాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తుండటం, మరోవైపు కార్మిక వర్గాలు ఆందోళనలు కొనసాగిస్తుండటంతో సర్కారు ఈ కర్మాగారాల నిర్వహణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమయ్యింది. ఈ నెలాఖరులో శాసనసభా సమావేశాలు జరుగనుండటం వలన ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతో గత వారం రోజులుగా ప్రభుత్వం నిజాంసుగర్స్ కర్మాగారాలను స్వాధీనం చేసుకునే విషయమై కసరత్తులు చేస్తోంది. ఈ కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఏ విధంగా స్వాధీనం చేసుకునే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. వంద కోట్లకు పైగా అప్పులు తీసుకువచ్చినట్లు డేల్టా యాజమాన్యం గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్కారు కర్మాగారాలను స్వాధీనానికి చర్యలు తీసుకుంటే ప్రైవేటు యాజమాన్యం అప్పుల విషయాన్ని తెరపైకి తీసుకురావతమే కాకుండా అప్పుల భారం ప్రభుత్వం భరించాలని ప్రైవేటు యాజమాన్యం స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బోధన్ కర్మాగారం పరిథిలో కొన్ని విలువైన భూములు కూడా ఉన్నాయి. వీటిపై కూడా ప్రైవేటు యాజమాన్యం ఇప్పటికే దృష్టి సారించింది. ఈ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలను పక్కా ప్లాన్‌తో కొన్ని నెలల క్రితం ఇక్కడి నుండి తొలగించింది. ఈ వ్యవహారాలన్నింటిపై యాజమాన్యానికి, ప్రభుత్వానికి నడుమ చర్చలు జరిగితే గానీ నిజాంసుగర్స్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.