నిజామాబాద్

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పిడి యాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, అక్టోబర్ 7: టిడిపి చేపడుతున్న పాదయాత్ర రాజకీయ లబ్దికోసమేనని ప్రజల కోసం కాదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. సోమవారం సాయంత్రం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపి హాయంలోనే రైతుల ఆత్మహత్యలు భారీగా చోటు చేసుకున్నాయన్నారు. టిఆర్‌ఎస్ పరిపాలనలో రైతుల ఆత్మహత్యలు తగ్గిన విషయాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై త్వరలోనే శాసనసభ సమావేశాల్లో పిడి యాక్టు తేవడానికి కృషి చేస్తామన్నారు. 28నెలల పాలనలో రైతులు, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. కెసిఆర్ పాలన బాగుందని పలు సర్వే సంస్థలు దేశంలోనే నెంబర్ వన్ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ప్రతిపక్ష పార్టీలు టిఆర్‌ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఆంధ్రలో సిఎం చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదన్న విషయాన్ని ఇక్కడి టిడిపి నాయకులు గుర్తించాలన్నారు. రైతులకు సాగు, తాగునీరు పూర్తిస్థాయిలో త్వరలో అందిస్తామన్నారు. 30లక్షల మంది రైతులకు గాను ఇప్పటి వరకు 12వేల 119కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రజలను మోసం చేయడానికే కొందరు పాదయాత్ర చేపడుతున్నారన్నారు. రబీ సీజన్‌లో పంటలు వేసే వారు ఏప్రిల్ నెలలోగా పంటలు కోసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో వడగాళ్ళ వర్షం పడి పంట నష్టం సంభవిస్తుందన్నారు. వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో కల్తీ విత్తనాలను అమ్మిన శివసాగర్, శివక్రిష్ణ, రాంచందర్, తదితరులపై పిడియాక్టు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో సబ్సిడి విత్తనాలను ఎక్కువగా అందించడం జరిగిందన్నారు. రైతులకు రుణాలు కావలంటే బ్యాంకులకు వెళ్లాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే బ్యాంకు అధికారులపై కలెక్టర్ చర్యలు చేపడుతారన్నారు. ప్రైవెట్ వ్యాపారుల వద్ద అప్పులు చేసి పంటలు పండించవద్దని కోరారు.