నిజామాబాద్

బంగారు తెలంగాణ కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, డిసెంబర్ 10: అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. శనివారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బిగాల, కలెక్టర్ యోగితారాణాలు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజలు బాగుపడ్తారని భావించి టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ 14సంవత్సరాల పాటు అలుపెరుగని పోరాటం చేసి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడటం, ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టంకట్టడం, కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణ తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి, కంటి నిద్ర ఉండాలని సిఎం కెసిఆర్ భావించారని, అందులో భాగంగానే అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికరమైన ఆహారం అందించి, తల్లిబిడ్డల ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సైతం మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద దేశంలో ఎక్కడాలేని విధంగా 51వేల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బిసిల్లోని పేదలకు సైతం త్వరలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆసరా, ఆహార భద్రత పథకం, జీవన భృతి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ యోగితారాణా మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్, మహిళలు తల్లికాగానే పౌష్టికాహారం అందిస్తున్నారని అన్నారు. అలాగే మైనార్టీల కోసం గురుకుల పాఠశాలల ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసం 10జిల్లాలు ఉన్న తెలంగాణను 31జిల్లాలుగా చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునీక సౌకర్యాలతో ఆధునీకరిస్తున్నామని, క్యాన్సర్ వ్యాధిని నిర్ధారించే పరికరం ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో క్యాష్‌లెస్‌పై అవగాహన కల్పిస్తున్నామని, దీంతో అవినీతి తగ్గుతుందన్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ, షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల కింద అందజేస్తున్న 51వేల రూపాయల చెక్కులను పెళ్లికి వారం రోజుల ముందు అందజేస్తే బాగుంటుందన్నారు. అనంతరం 489మందికి మంజూరైన 2కోట్ల 49లక్షల 39వేల రూపాయల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్‌ల చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీం, జెసి రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ యాదిరెడ్డి, తహశీల్దార్‌లు సుదర్శన్, శ్రీనివాస్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ప్రజల ఆకాంక్షలను
పట్టించుకోవడం లేదు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ఆర్మూర్, డిసెంబర్ 10: రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర రెండవ రోజు ఆర్మూర్ మండలంలోని పిప్రి, ఫత్తేపూర్, సుర్భిర్యాల్, కోమన్‌పల్లి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండున్నర సంవత్సరాలు దాటి పోయినా దాని గురించి ప్రస్తావన లేకుండా పోయిందని అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, పెన్షన్లు, రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఆర్మూర్ మండలంలో ముంపు గ్రామాలైన కోమన్‌పల్లి, ఖానాపూర్ గ్రామ ప్రజలకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా గత పాలకుల విధానాలనే అవలంభిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కిలో మీటర్ల పాదయాత్ర చేసిన అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాత వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించి ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర కోమన్‌పల్లి గ్రామం మీదుగా బాల్కొండ మండలానికి వెళ్లింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జాన్‌వెస్లీ, రమణ, అబ్బాస్, రమ, ఆశయ్య, నగేష్, శోభన్, పల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య, గంగాధరప్ప తదితరులు పాల్గొన్నారు.