నిజామాబాద్

అఖిలపక్షం నేతల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, డిసెంబర్ 11: గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించే విషయమై తమకు స్పష్టమైన హామీ రావడం లేదని ఆరోపిస్తూ ఆదివారం గాంధారి ప్రధాన రహదారిపై అఖిలపక్షం నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని తాము గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని వారు మండిపడ్డారు. తమ మండలానికి అన్యాయం జరుగుతుందని తెలిపినా సంబంధిత అధికారులు గానీ, అధికార పార్టీ నేతలు గానీ ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదని ఆరోపించారు. గాంధారి మండల సర్పంచ్‌లో ఈ విషయమై తీర్మాణాలు కూడా ఇస్తామని చెప్పి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వల్ల కాకపోతే ఆ విషయాన్ని కూడా సభా ముఖం గా మండల ప్రజలకు తెలియజేయాలని వారు ఆరోపించారు.
గాంధారి మండలాన్ని ఎల్లారెడ్డిలో కాకుండా కామారెడ్డిలో కొనసాగించే విషయమై మేము కూడా మీకు అండగా ఉంటామని అధికార పార్టీ నేతలు చెప్పడం, తీర్మాణాలు ఇస్తామని చెప్పి తప్పించుకోవడం సర్పంచ్‌లకు అలవాటుగా మారిందని వారు ఆరోపించారు. తమకు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాము కదలమని రోడ్డుపై అఖిలపక్షం నేతలు బైఠాయించారు. దీంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ రవికుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకుని అఖిలపక్షం నేతలను సముదాయించి ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. ఆందోళన కార్యక్రమంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో పోలీసులు క్లీయర్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పోతంగల్ కిషన్‌రావు, తూర్పు రాజులు, సంగని బాలయ్య, కామెల్లి బాల్‌రాజు, వార్డు సభ్యుడు రెడ్డి రాజు, లైని రమేష్, ఎండ్రాల గోపాల్, శంషోద్దీన్, సిపిఎం మండల కార్యదర్శి కమ్మరి సాయిలు, కంచరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం
కంఠేశ్వర్, డిసెంబర్ 11: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆదివారం నగరంలోని ఫూలాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలుపడంతో పాటు మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయడాన్ని పిడిఎస్‌యు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడానికే ఈ బిల్లును తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలోని అనేక యూనివర్సిటీలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వర్సిటీల్లో నియామకాలు జరిపి, నిధులు వెచ్చించి యూనివర్సిటీలను బాగు చేయాల్సిన ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వ వర్సిటీలను నిర్వీర్యం చేసుందుకు పూనుకోవడం దారుణమన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ఆమోదం పొందితే, ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ఒకవైపు కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని గొప్పలు చెప్పుకుంటున్న కెసిఆర్, మరోవైపు డిగ్రీ, పీజీ చదువులను ప్రైవేటుకి అప్పగించే కుట్రలు చేయడ సిగ్గుచేటన్నారు.

సేవా కార్యక్రమాలు అభినందనీయం
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్, డిసెంబర్ 11: తన తండ్రి దివంగత వేముల సురేందర్‌రెడ్డి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మిషన్ భగరథ వైస్ చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం వేల్పూర్‌లోని హైస్కూల్ ఆవరణలో తిరుమల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సురేందర్‌రెడ్డి స్మారకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఈ ప్రాంతంలో ప్రజలకు అందించిన సేవలకు ప్రతిఫలంగా నియోజకవర్గంలో పలువురు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తన తండ్రి పేరిట ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినా వాటిలో తాను భాగస్వామిని అవుతానని అన్నారు. తిరుమల ఆసుపత్రి చైర్మన్ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తన సొంత గ్రామమైన వేల్పూర్ ప్రజలకు నిరంతరం వైద్య సేవలను ఉచితంగా అందిస్తానని అన్నారు. ఎలాంటి ఆపరేషన్లు చేయించుకున్నా ఫీజులో రాయితీని అందిస్తానని అన్నారు. అంతకుముందు సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పాలెపు రజిత, వైస్ చైర్మన్ రేగుల్ల రాములు, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ నీరడి భాగ్య, డాక్టర్ అశోక్, నాయకులు మహిపాల్, యాసిన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చసేన అంబేద్కర్ విగ్రసాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే వేల్పూర్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాదవులకు మంజూరైన గొర్రెల యూనిట్ల రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.