నిజామాబాద్

క్యాష్ కౌంటర్ల పెంపుతో మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, డిసెంబర్ 15: రెంజల్ మండలం సాటాపూర్ ఎస్‌బిహెచ్ బ్యాంకులో క్యాష్ కౌంటర్లు పెంచి, వినియోగదారులకు సరిపడా డబ్బును అందించాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ బోధన్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ముందు చూపు లేకుండా తీసుకున్న పెద్దనోట్ల రద్దుతో మండల, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కోన్నారు. దేశంలో నల్లధనాన్ని నిర్మూలించేందుకు వీలుగా 500, 1000రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం, అందుకు ప్రత్యామ్నాయంగా కొత్త కరెన్సీని అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దీంతో వివాహ శుభకార్యాలు చేసే తల్లిదండ్రులు, పంటలు సాగు చేసే రైతన్నలు, చిన్నచిన్న వ్యాపారాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న చిరువ్యాపారులు గడిచిన నెల రోజులుగా తీవ్రమైన కరెన్సీ కొరత వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి వారానికి 24వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్న ఆర్‌బిఐ అధికారులు, ప్రస్తుతం ఆ మొత్తాన్ని 10వేలకు తగ్గించడం జరిగిందన్నారు. బ్యాంకుల్లో వినియోగదారులకు సరిపడా నగదు నిల్వలు లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిలబడినా ఫలితం లేకుండాపోతోందన్నారు. సాటాపూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్‌లోని ఖాతాదారులు గడిచిన వారం పది రోజులుగా నగదు కోసం నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, రెండు రోజుల బ్యాంకుకు వెళ్లినా కనీసం 5వేల రూపాయలు చేతికి అందని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి సాటాపూర్ ఎస్‌బిహెచ్‌లో కౌంటర్లను పెంచి, ఖాతాదారులకు సరిపడా నగదును అందుబాటులో ఉంచాలని కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో యూత్ కాంగ్రెస్ మండల నాయకులు సతీష్, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా నగదు దాచుకున్న వారికి శిక్ష
ప్రజల సంక్షేమం కోసమే నోట్ల రద్దు
బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌రాజు యాదవ్

కామారెడ్డి, డిసెంబర్ 15: బ్యాంకు ముసుగులో అక్రమంగా నగదు దాచుకున్న వారితో పాటు అధికారుల అండదండలతో అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్న వారికి శిక్ష తప్పదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌రాజు యాదవ్ అన్నారు. గురువారం ఆయన బృందావన్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసమే ప్రధాని మోడి నోట్లను రద్దు చేశాడన్నారు. విపక్షాలతో పాటు ఢిల్లీ, పశ్శిమ బెంగాల్, తదితర సిఎంలు నోట్ల రద్దుపై అసత్య ఆరోపణాలు చేస్తున్నారన్నారు. వారికి రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. సామాన్య ప్రజలకు కొద్దిగా ఇబ్బందులు ఉన్న మరికొద్ది రోజుల్లోనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ప్రస్తుతం బిజెపిపై ఆరోపణాలు చేయడం సిగ్గుచేటన్నారు. నోట్లరద్దుతో కాశ్మీర్‌లో అల్లర్లు నిలిచిపోయాయన్నారు. పాకిస్తాన్, తదితర దేశాల్లో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ ఉండేదని, ప్రస్తుతం నోట్ల రద్దుతో ఆ దేశాలకు పెద్ద దెబ్బ అన్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారులో 2కోట్ల నగదు కాలిపోయినప్పుడు ఎలాంటి సమాధానం చెప్పలేదని, అంత నల్లధనం ఎక్కడిదని ప్రశ్నించారు. నిర్మాణాత్మాకమైన సలహాలు ఇస్తే బిజెపి పార్టీ స్వీకరిస్తుందన్నారు. నూతనంగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డిని అభినందించారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసమే మోడి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంస్థగత, సంబంధిత కమిటీలను వేసి పార్టీ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. రాబోయో రోజుల్లో అత్యాధిక స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్‌రావు, బిజెపి అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళిధర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిద్దిరాములు, నాయకులు నీలం రాజులు, మోతె క్రిష్ణాగౌడ్, చింతల రమేశ్, జులూరి సుధాకర్, తేలు శ్రీను, నవీన్‌పటేల్, బత్తుల కిషన్, సాయిలు, రమేశ్, తదితరులున్నారు.