నిజామాబాద్

కొండా అడుగుజాడల్లో నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 18: కొండ లక్ష్మణ్ బాపూజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. అలాంటి నాయకుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనంద్‌భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. మంత్రి పదవిని కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో త్యాగం చేసిన గొప్ప నేత అని కొనియాడారు. అలాంటి నేతలను స్మరించుకోని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. శాంతియుతంగా ఉద్యమాలు జరిపి అనేక విజయాలు సాధించిన గొప్ప వ్యక్తి అన్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్ల కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. సేవే తత్వంగా పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాగే జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఉద్యమాలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. పదవులను వదులుకొని ఉద్యమ బాట పట్టడం గొప్ప విషయమన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక ఉద్యమాల్లో అన్ని పార్టీల నాయకులను కలుపుకోని ముందుకు వెళ్లడం గొప్పవిషయమన్నారు. అలాంటి మహనీయుడిని విగ్రహాన్ని కామారెడ్డి ఏర్పాటులో చేయడం అభినందనీయమన్నారు. అంతకు ముందు కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని చర్చి ప్రధాన చౌరస్తా వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్, రాజ్యసభ సభ్యుడు రాపోల్ ఆనంద్‌భాస్కర్‌లు ఆవిష్కరించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిప్పిరి సుష్మ, కౌన్సిలర్లు చాట్ల లక్ష్మీ, జడ్పీటిసి సభ్యులు నంద రమేశ్, పద్మశాలి సంఘం ప్రతినిధులు చాట్ల రాజేశ్వర్, శెర్ల రాములు, నాగభూషణం, రాజమణి, జగన్నాథం, క్యాతం సిద్దిరాములు, మార్కండేయులు, వేణు, గంగాధర్, రాజు, హరి, శ్రీహరి, సత్యం, నర్సింలు, తదితరులున్నారు.

అలీఫ్ ఇండియా కృషి అమోఘం
నగర మేయర్
కంఠేశ్వర్, డిసెంబర్ 18: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఉచిత శిక్షణ అందిస్తున్న అలీఫ్ ఇండియా సేవలు అమోఘమని నగర మేయర్ ఆకుల సుజాత పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వినాయక్‌నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్జీఓస్ కాలనీలో సమాఖ్యత్సోవ వేడుకలు జరుగగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత మాట్లాడుతూ, మహిళలకు టైలరింగ్, సంగీతంలో ఉచిత శిక్షణ ఇవ్వడాన్ని అభినందించారు. 24సంవత్సరాలుగా అలీఫ్ ఇండియా శిక్షణ ఇస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా జనపనార బ్యాగులను వినియోగించాలని ఆమె పిలుపునిచ్చారు. జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు అందేలా తనవంతు కృషి చేస్తానని మేయర్ హామీ ఇచ్చారు. అనంతరం అల్లికల పోటీల్లో గెలుపొందిన యువతులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాంగుబాయి, జాలింగం సునీత, మేనేజర్లు శీలా లలిత, జ్యోతి, ట్రైనర్స్ మానస, సంగీతతో పాటు మహిళలు పాల్గొన్నారు.