నిజామాబాద్

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, డిసెంబర్ 23: రాష్ట్రంలోని మత్స్యకార్మికుల అభ్యున్నతికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మిషన్ భగీరథ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మెండోర మండలంలోని పోచంపాడ్ జాతీయ మత్స్య ఉత్పత్తి కేంద్రంలో 4.30 కోట్లతో చేపట్టిన చేపల పెంపకం పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మత్స్యకారులతో మాట్లాడుతూ, ప్రస్తుతం పోచంపాడ్ చేపల ఉత్పత్తి కేంద్రం లక్షా 70వేల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తోందని, దీని సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 200నీటి కుండీలతో 7లక్షలకు పైచిలుకు చేప పిల్లలను పెంచేందుకు వీలుగా నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మత్స్యకారుల అభ్యున్నతికి కోసం సిఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 45కోట్ల చేప పిల్లలను 100శాతం సబ్సిడీపై అందించి, తెలంగాణలోని అన్ని చెరువుల్లో విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 42లక్షల చేప పిల్లలను ఆయా గ్రామాల్లోని చెరువుల్లో విడుదల చేయడం జరిగిందని, అలాగే మరో 50వేల చేప పిల్లలను శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లో విడుదల చేయడం జరిగిందన్నారు. ఇలా చేప పిల్లలను విడుదల చేయడం ద్వారా ఒక్కో చేపను 100 రూపాయలకు కిలో చొప్పున విక్రయించవచ్చని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద చేతివృత్తుల వారి ఆదాయమని ఆయన అన్నారు. దీంతో మత్స్యకారుల జీవన పరిస్థితులు మారిపోనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మత్స్యకారుల కోరిక మేరకు 5లక్షల చేప పిల్లల ఫ్లాట్ ఫామ్‌ను, జిల్లా కేంద్రంలో అత్యాధునీక సౌకర్యాలతో మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీవాణి రమేష్, వైస్ ఎంపిపి శేఖర్, ఇఇ రామారావు, మత్స్యశాఖ ఎడి మహిపాల్, ఎఫ్‌డిఎ రాజనర్సయ్యతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని మత్స్య కార్మికులు పాల్గొన్నారు.

పాఠశాలల వౌలిక వసతులకు
రూ. 73.4 కోట్ల ప్రతిపాదనలు
డిఇఒ మదన్‌మోహన్
ఎల్లారెడ్డి, డిసెంబర్ 23: డివిజన్ కేంద్రంలోని స్థానిక జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలను శుక్రవారం జిల్లావిద్యాశాఖాధికారి టి.మదన్‌మోహన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలోని 334 పాఠశాలల గదులు శిథిలావస్థలో ఉన్నాయని, వీటి మరమ్మతులు, ప్రహరి గోడల నిర్మాణాలు, టాయిలెట్స్, వౌలిక వసతుల కల్పన కోసం 73.4 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. 2016-17 విద్యాసంవత్సరానికి గాను జిల్లావ్యాప్తంగా 290 పాఠశాలల నుంచి 13,090 మంది విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పదిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకోసం అన్ని పాఠశాలల్లో నవంబర్ 5వ తేది నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం ఒక గంటపాటు ప్రత్యేక తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు సబ్జేక్ట్‌ల వారిగా స్లిప్ టెస్ట్‌లను నిర్వహిస్తూ, వారిని వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయిలో సంసిద్దులు చేసేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.