నిజామాబాద్

మీసేవ కేంద్రాలతో నగదు రహిత లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, డిసెంబర్ 26: జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరపడానికి చర్యలు చేపడుతున్నామని జాయంట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవీలు జరపడం వల్ల బ్యాంకుల చుట్టు తిరగడం, చిల్లర కష్టాలు దూరమవుతాయని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మీసేవ కేంద్రం ఏర్పాటు చేశామని, ముందుకు వచ్చిన నిరుద్యోగ విద్యావంతులైన యువకులు దరఖాస్తు చేసుకుంటే మీసేవ కేంద్రాన్ని మంజూరు చేస్తామన్నారు. ఈ కేంద్రంలో నగదు రహిత లావాదేవీలు జరుపుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. నగదు రహిత లావాదేవీలను స్థానికంగానే ఉంటూ జరుపుకునే అవకాశం ఉందన్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా, బ్యాంకు ఖాతాలో ఉంటే చాలు తమ అవసరాలను తీర్చుకోవచ్చని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా తీసుకోవాలని, అప్పుడే నగదు రహిత లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుందని జెసి తెలిపారు. రేషన్ డీలర్లు పిడిఎస్ రైస్ పొందే అన్ని రకాల కార్డు హోల్డర్స్ జాబితాను పేర్లతో దుకాణం ముందు అతికించాలని డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ కృష్ణమూర్తి, సర్పంచ్ నారాయణరెడ్డి, వైఎస్ ఎంపిపి ఆరె గంగాధర్, తహశీల్దార్ ఉమాకాంత్‌రావు, ఎంపిడిఓ నాగవర్ధన్, మాజీ ఎంపిటిసి నర్సాగౌడ్, గ్రామ కమిటీ పెద్ద మల్కారెడ్డి, నగేష్, కాంతరావు, రేషన్ డీలర్ రాజేందర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

వైభవంగా మల్లన్న కల్యాణోత్సవం
కామారెడ్డి రూరల్, డిసెంబర్ 26: మండలంలోని దేవునిపల్లిలో మల్లన్న, గొల్లకేతమ్మ, మేడాలమ్మల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి సర్పంచ్ నిట్టు వెంకట్‌రావు, వినోదబాయి, విడిసి అధ్యక్షులు కాసర్ల రవిందర్, మాధవి, పెద్దోల్ల శివాజీరావు, శాలిని దంపతుల ఆధ్వర్యంలో వస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 7గంటలకు ఆలయ ఆవరణలో గుడిమెట్‌కు చెందిన మహదేవ్ స్వామిని హనుమాన్ ఆలయం నుంచి అగ్నిగుండాల వరకు ఎదుర్కొని వచ్చారు. వీరశైవులు, భక్తులు అగ్నిగుండాలు తొక్కారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంట్‌రావు, ఉప సర్పంచ్ రాజేందర్, వైస్ ఎంపిపి కృష్ణాజిరావు, గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు రవిందర్, మల్లేశ్, రవి, రాజేందర్, సిద్దిరాములు, నారాయణ, నర్సింలు, లక్ష్మీపతీయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
భీమ్‌గల్, డిసెంబర్ 26: భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెండోరా గ్రామానికి చెందిన గండికోట పోసాని(50)అనే మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు పోసానికి మానసిక పరిస్థితి బాగలేక తిరుగుతూ ఉండేదని, గడిచిన ఐదు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదన్నారు. అప్పటి నుండి మృతురాలి కుమారులు గాలింపు చేపట్టినప్పటికీ, ఆమె గురించి ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. సోమవారం ఉదయం మెండోరా గ్రామంలోని పెద్దచెరువులో శవం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా, గండికోట పోసానిగా గుర్తించడం జరిగిందన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలికి భర్త, నలుగురు కుమారులు ఉన్నట్లు ఎస్‌ఐ వివరించారు.