నిజామాబాద్

‘దినకర్మ’తో నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, డిసెంబర్ 26: గాంధారి మండల కేంద్రంలో సోమవారం మండల అధికార పార్టీ నేతల దినకర్మను అఖిలపక్షం నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం నెహ్రూ విగ్రహం ఆవరణలో ప్రధాన రోడ్డు పక్కన వంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఐదురోజుల క్రితం ప్రజాప్రతినిధుల శవయాత్ర నిర్వహించిన అనంతరం సోమవారం దినకర్మ సందర్భంగా రోడ్డుపై అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అన్నదాన కార్యక్రమాన్ని పక్కకు తప్పించారు. అనంతరం అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ గాంధారి మండలాన్ని కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లో కొనసాగించే వరకు తమ ఆందోళన తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తమ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు దీక్షకు మద్దతు తెలిపి మండల ప్రజల పక్షాన ప్రభుత్వానికి మండల సమస్యను విన్నవించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పోతంగల్ కిషన్‌రావు, తూర్పు రాజులు, సంగని బాలయ్య, గడ శంకర్, రెడ్డి రాజు, కామెల్లి బాల్‌రాజు, లైని రమేష్, శంషోద్దీన్, సిపిఎం కార్యదర్శి కమ్మరి సాయిలు, కంచరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.