తెలంగాణ

‘వన్ హైదరాబాద్’కే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు డిజి నర్సింహారావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల కరపత్రాన్ని నర్సింహారావు ఆవిష్కరించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ జిహెచ్‌ఎంసిలో గెలుపుకోసం సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తోందని అన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, టిడిపి, ఎంఐఎంలు ఆంతరంగిక సంక్షోభంతో, రెబల్స్ గొడవతో ప్రచారం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయని అన్నారు. మెరుగైన స్వచ్ఛ హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఏర్పడ్డ ‘వన్ హైదరాబాద్’ కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సంస్థలకు హక్కులు హక్కులు, విధులు, పారదర్శక పరిపాలన వంటివి సాధించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25 నుంచి జనవరి 31 వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.