బిజినెస్

ఒఎన్‌జిసి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా-గోదావరి (కేజి) బేసిన్‌లోగల ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని అందుకుంది. 53,000 కోట్ల రూపాయలకుపైగా నిధులతో 45 చమురు బావుల అభివృద్ధి, వాటికి సంబంధించిన ఇతర వౌలిక సదుపాయాలను ఒఎన్‌జిసి ఇక్కడ కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు కావాల్సిన పర్యావరణ అనుమతిని ఇస్తున్నట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు.