రంగారెడ్డి

ఔటర్ రింగురోడ్డుపై మరో ప్రమాదం రెండు లారీల ఢీ ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, ఫిబ్రవరి 12: ఔటర్ రింగురోడ్డుపై ఆగివున్న లారీని మరో లారీ ఢీ కొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగురోడ్డుపై శక్రవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి 9గంటర సమయంలో ఔటర్ రింగురోడ్డుపై గడ్డి లోడ్‌తో వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో పక్కన నిలిపాడు. డ్రైవర్ లారీని నిలిపి లారీ క్రింద మరమ్మతు పనులను చేస్తున్నాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన మరో లారీ వెనుక నుండి ఢీకొట్టింది. ఘటనలో పటన్‌చెరుకు చెందిన లారీ డ్రైవర్ జైపాల్‌రెడ్డి, డ్రైవర్ ఆహ్మద్, లారీ క్లీనర్ మోహన్‌లు అక్కడి కక్కడే మృతి చెందాడు. ఘటన స్దలాన్ని బొల్లారం పోలీసు సందర్శించి మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం పటాన్‌చెరుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా సమాచార శాఖ
ఉప సంచాలకులుగా సరస్వతి నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 12: రంగారెడ్డి జిల్లా సమాచార శాఖ ఉప సంచాలకులుగా పి.బి. సరస్వతి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సమాచార శాఖ కేంద్ర కార్యాలయంలో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న సరస్వతి పదోన్నతిపై ఉప సంచాలకులుగా రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం నియమించింది. గతంలో ఉప సంచాలకులుగా పని చేసిన విజయ్ గోపాల్ 5వ మండలం ప్రాంతీయ ఉప సంచాలకులుగా పదోన్నతిపై వెళ్లారు.
పెగా సిస్టమ్స్ వాలెంటైన్స్ డే వేడుకలు
గచ్చిబౌలి, ఫిబ్రవరి 12: నిత్యం కంప్యూటర్లతో కుస్తీపట్టే ఐటి ఉద్యోగులు కీబోర్డులు పక్కనపెట్టి వాలెంటైన్స్ డే వేడుకల్లో సందడి చేశారు. మాదాపూర్‌లోని రహేజా, మైండ్ స్పేస్‌లోగల పెగా సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న వాలెంటైన్స్ వేడుకల్లో స్నేహితులతో, బెంగుళూరులో పనిచేసేవారితో సెల్ఫీ ఫొటోలు దిగారు. ఇందులో ఉత్తమ సెల్ఫీని ఎంపికచేసి బహుమతులను అందజేయనున్నట్లు పెగా సిస్టమ్స్ ఎం.డి సుమన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఉద్యోగులతోపాటు అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంవలన ఉత్సాహం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 12: హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను నిర్వహిస్తున్నట్లు పద్మశాలిపురం రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు బొల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 14వ తేది నుంచి 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. కాటేదాన్ మణికంఠహిల్స్‌లోని పయనీర్ కానె్సప్ట్ స్కూల్లో దరఖాస్తు లను అందజేస్తున్నట్లు తెలిపారు. 45 రోజులు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు కొనసాగుతుందని, స్పోకెన్ ఇంగ్లీష్ 5వ బ్యాచ్ అని వివరించారు. ఈనెల 22 నుంచి క్లాస్‌లు ప్రారంభం అవుతాయని, ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు.