బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ముగింపు దశకు చేరడంతో ఇక మదుపరుల దృష్టి ఈ వారం ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు. జనవరికిగాను వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, డిసెంబర్‌కుగాను పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు గత వారం విడుదలైనది తెలిసిందే. శుక్రవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిశాక ఈ గణాంకాలు వెల్లడి కావడంతో వీటి ప్రభావం సోమవారం ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐఐపి 1.3 శాతానికే పరిమితమవగా, రిటైల్ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్ఠానికి ఎగిసింది. ఇక జనవరి నెలకు సంబంధించి టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా సోమవారం వెలువడనుండగా, వీటి ఆధారంగా మదుపరులు తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటారనీ పేర్కొంటున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వార్షిక బడ్జెట్‌పై మదుపరుల దృష్టి ఉండటంతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందంటున్నారు. ‘ఆర్థిక ఫలితాల సీజన్ ముగింపునకు చేరడంతో ద్రవ్యోల్బణం, ఐఐపి, అలాగే కేంద్ర బడ్జెట్‌పై మదుపరుల చూపు ఉంటుందని భావిస్తున్నాం.’ అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ మిడ్‌క్యాప్స్ రిసెర్చ్ ఎవిపి రవి షెనాయ్ అన్నారు. ‘ఈ వారం మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావచ్చు.’ అని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోదీ అన్నారు. గత వారం విడుదలైన ఐఐపి గణాంకాలు నిరాశాజనకంగా ఉండటం, ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకడం వంటివి దీనికి కారణమని మోదీ పేర్కొన్నారు. ఇకపోతే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల ప్రభావం మార్కెట్లపై ఎప్పటిలాగే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి దేశీయ పరిణామాల కంటే కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లే భారత స్టాక్ మార్కెట్లను ఇటీవలికాలంలో అధికంగా ప్రభావితం చేస్తున్నాయి. గత వారం నష్టాలే ఇందుకు నిదర్శనం. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,631 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 508 పాయింట్లు పడిపోయాయి. బ్యాంకింగ్ రంగ సంస్థలు, ఇతర సంస్థల ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్ భారీ నష్టాలకు కారణమవగా, ఈ వారం ఆర్థిక ఫలితాలు దాదాపు ముగిసిపోవడంతో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.