AADIVAVRAM - Others
కృతజ్ఞతలు(సండేగీత)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొన్ని విషయాలు చెప్పడానికి సులువుగా వుంటాయి.
వినడానికి బాగుంటాయి.
కష్టకాలంలో వున్న వ్యక్తికి అవే విషయాలు కష్టంగా వుంటాయి.
తప్పదు.
అది నిజం.
కానీ
పాటించాల్సిందే!
అన్ని పరిస్థితుల్లో దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పటం.
పరిస్థితులు అన్నీ సుఖప్రదంగా వున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి.
కష్టంగా వున్నప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి.
అన్ని పరిస్థితుల్లోనూ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.
మనను ఇతరులు ప్రశంసించినప్పుడు
అదే విధంగా విమర్శించినప్పుడు
ఒత్తిడిలో వున్నప్పుడు...
బాధలో వున్నప్పుడు...
విజయం సాధించినప్పుడు..
అపజయం పొందినప్పుడు..
నిరంతరం కృతజ్ఞతలు చెప్పాల్సిందే
మొలక రెండు ఆకులతో కృతజ్ఞతలు చెప్పినట్టు,
కృతజ్ఞతలు చెప్పాల్సిందే!
దేవదేవునికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పాల్సిందే!
ఈ మాటలు నిజమే అయినా
మింగుడు పడటం కష్టం.