AADIVAVRAM - Others

ఇప్పుడు ఏం చేద్దాం? ( సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత చరిత్ర లాంటి డైరీలోని కాగితాలకు సెలఫెన్ టేప్ వేసి కొత్త జీవితం ప్రారంభించండి అని ఓ పెద్దాయన చెప్పిన మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. సమాజ హితం కోసం మీరు చేపట్టే కొత్త జీవితమే ప్రజలూ సమాజం గుర్తుంచుకుంటుంది. టేప్ వేసిన పేజీలు ఎవరికీ అవసరం లేదు.
నిజమే!!
ఇప్పటి వరకు మనం మంచి చేశామో, చెడు చేశామో మనకు తెలుసు. చేసిన వాటిని ఇప్పుడు మనం మార్చలేం.
మన జీవితం టేప్‌రికార్డర్ కాదు. టేప్‌ని చెరిపి వేసి తిరిగి రాయలేం.
మనం రాస్తున్నది చెదిరిపోని ఇంక్ పెన్నుతో.
పెన్సిల్‌తో కాదు.
కానీ
ఇప్పుడు ఏం చెయ్యడం అన్నది ముఖ్యమైనది.
దాన్ని ఇంకా మనం రాయడం ప్రారంభించలేదు.
మనం ముందున్న ఈ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం అన్నది మన చేతిలో వుంది.
రేపు అనేది మన ముందు వున్నది.
దాన్ని ఏ విధంగా రూపుదిద్దుకుంటామన్నది
మన చేతిలో వుంది.
గతాన్ని చూస్తూ
గతాన్ని విమర్శిస్తూ
కూర్చుంటే ఉపయోగం లేదు.
అలా చూస్తూ వుంటే బాధ వుంటుంది.
పశ్చాత్తాపం వుంటుంది.
ఫలితం ఉండదు.
గతం మన పట్ల శాపంలా వుండి వుండవచ్చు.
కానీ భవిష్యత్తు...?
అలా వుండదు.
ఉండకపోవచ్చు.
ఇప్పుడు మనం ఏం చేద్దాం.
రేపుని ఎలా తీర్చిదిద్దుకుందాం.
అది మన చేతిలో వుంది.
ఎందుకంటే దాన్ని ఇంకా రాయలేదు.
ఇంకా మొదలుపెట్టలేదు.
ఇప్పుడు ఏం చేయాలన్నదే ముఖ్యమైంది.
ఏమంటారు...?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001