ఓ చిన్నమాట!

అక్షరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్నెట్ వచ్చిన తరువాత సమాచారం అందరికీ సులువుగా అందుతోంది. స్మార్ట్ఫోన్ వచ్చిన తరువాత అది ఇంకా సులువైంది. గుడ్‌మార్నింగ్‌లు, గుడ్‌నైట్‌లు ఇలా ఎన్నో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిపోతున్నాయి.
ఎన్నో వెబ్‌సైట్లు. ఎన్నో శుభాకాంక్ష సందేశాలు.
వాటిల్లో నుంచి ఎంపిక చేసి చాలా మంది పంపిస్తూ వుంటారు.
మంచిదే!
అదే విధంగా గొప్పవాళ్ల కొటేషన్స్ ఎంపిక చేసి పంపిస్తూ వుంటారు.
మరీ మంచిది.
ఉదయానే్న కొన్ని మంచి మాటలు చదవడం మరీ మంచిది.
పండుగలు, పబ్బాలప్పుడు కూడా వెబ్‌సైట్ల నుంచి సేకరించి శుభాకాంక్షలు పంపిస్తూ వుంటారు. వీడియోలు. ఇట్లా ఎన్నో. ఉదయానే్న శుభాకాంక్షలు చెప్పుకోవడం మీద మరికొన్ని సందేశాలు.
వాట్సప్ సందేశాలకి డబ్బులు ఖర్చవవు. అవి ఉచితం. అందుకని చాలామంది ఒకే విషయం మీద లెక్కలేనన్ని మెసేజీలు ఫార్వర్డ్ చేస్తూ వుంటారు. ఎదుటి వాళ్లకు విసుగు కలిగించే విధంగా పంపిస్తూ వుంటారు.
వీళ్లందరికీ నాదొక మనవి.
ఎవరో పంపినవి ఫార్వర్డ్ చేయడం కాదు. అదే విధంగా వెబ్‌సైట్ల నుంచి ఎంపిక చేసి పంపించడం కాదు. అలా చేయడం తప్పని నా ఉద్దేశం కాదు. కానీ మనమే సృష్టికర్తలమైతే వుండే ఆనందం వేరు.
కొత్త ఆలోచనలు
కొత్త ఊహలు
అందరికీ వస్తాయి.
వాటిని అక్షరబద్దం చేయడానికి ఇష్టపడరు. లేదా జంకుతారు.
మన ఆలోచనలు అందమైనవి.
మన ఊహలు గొప్పవి.
వాటిని అక్షరబద్దం చేసి ఈ ప్రపంచానికి పంపిద్దాం.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001