ఓ చిన్నమాట!

విమర్శలు-పరిమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమర్శ లేకుండా జీవితం గడవదు. మనకు ఇష్టం వున్నా లేకున్నా ఎప్పుడూ విమర్శ కొనసాగుతూనే ఉంటుంది. విమర్శల్లో సద్విమర్శ కూడా ఉంటుంది. విమర్శలోని మంచిని మనం గ్రహించగలగాలి. అప్పుడు కొంత వృద్ధి చేసుకోగలుగుతాం.
విమర్శ వేరు. తీర్పులు వేరు. ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు అందులోని బాగోగులు చెప్పడం, మరోలా చేస్తే బాగుండేదని చెప్పడం లాంటి విమర్శలను స్వాగతించాల్సిందే. అలా కాకుండా కొంతమంది ఇతరుల మీద తీర్పులు చెప్పేస్తుంటారు.
వాడికి ఏమీ చేతకాదు.
వాడు ఎందుకూ పనికిరాడు.
ఆ పని చేయడం వాడి శక్తికి మించి ఎక్కువ.
ఈ విధంగా తీర్పులు చెప్పేవాళ్లు ఎక్కువ హాని చేస్తారు. పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోనప్పుడు ఇలాంటి మాటలు ఎక్కువ విన్పిస్తుంటాయి. చాలామంది పిల్లలు ఇలాంటి మాటలతో నిరుత్సాహానికి గురవుతారు.
చిన్నతనంలో ఇలాంటి మాటలు పిల్లల మనస్సులని గాయపరుస్తాయి. ఆ మాటలు వాళ్లని వెంటాడుతాయి. దానివల్ల వారి స్వభావం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా పొయ్యే అవకాశం ఉంది. అది వారి అంతఃచేతనలో వుండి వాళ్లు తమని తాము నిందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
నేనెందుకూ పనికిరాను. నేనేమీ చేయలేను
అన్న భావనకి వాళ్లు లోనవుతారు. అందుకని పిల్లలని ఎప్పుడూ అలా అనకూడదు. పెద్దవాళ్లని విమర్శించవచ్చేమో కానీ నిరుత్సాహపరచకూడదు. చిన్నపిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లని నిరుత్సాహపరచకూడదు.
నిరుత్సాహపరిచే వ్యక్తులు చాలాచోట్ల కన్పిస్తూ ఉంటారు. వాళ్లు స్నేహితులు కావొచ్చు. అన్నదమ్ములు కావొచ్చు, తోటి ఉద్యోగులు కావొచ్చు, కొన్నిసార్లు తల్లిదండ్రులు కావొచ్చు.
మేం యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఓ మిత్రుడు ఉండేవాడు. వాడు అందరినీ ఏదో ఒక విషయంలో నిరుత్సాహపరచేవాడు. కాంపిటేటివ్ పరీక్షలు రాసేవాళ్లని - ఆ ఉద్యోగాలు ఎప్పుడో అమ్ముడుపోయాయని నిరుత్సాహపరిచేవాడు. బాస్కెట్‌బాల్ ఆడేవాళ్లని ఓ రకంగా, కథలు రాసే నన్నూ, నా రూమ్మేట్‌ని ఓ రకంగా విమర్శించేవాడు. మేం వాడి మాటలను తీసి బయటపడేసి మా పని మేం చేసేవాళ్లం.
అప్పుడు ఓ వారపత్రికలో కతల పోటీల ప్రకటన వచ్చింది. నేనూ, నా రూమ్మేట్ కథ రాసి పంపించాలని అనుకున్నాం. మీకు ప్రైజ్ వస్తే నేను చెవి కోయించుకుంటానని మా మిత్రుడు మాతో సవాలు విసిరాడు.
రాసిన వాళ్లందరికీ ప్రైజులు రావు. అయినా మా ప్రయత్నం మేం చేస్తామని నేను అన్నాను. నీ పేరు మీద కూడా కథ రాస్తాం. దానికి కూడా ప్రైజు వస్తుందని మా రూమ్మేట్ జవాబు చెప్పాడు. చివరికి కథలు రాశాం. పంపించాం. మా రూమ్మేట్ మా మిత్రుడి పేరు మీద కథ రాసి పంపించాడు. మా ఇద్దరి కథలు మామూలు ప్రచురణకి స్వీకరించారు. కానీ మా మిత్రుడి పేరు మీద రాసిన కథకి మూడవ బహుమతి వచ్చింది.
మా మిత్రుడు ఆ కథ చదివాడు.
ఆ కథలోని పాత్ర అందరినీ నిరుత్సాహపరుస్తుంది. కానీ అందులోని ఒక పాత్ర నిరుత్సాహపడలేదు. అన్ని నిరుత్సాహ మాటలని ప్రక్కకు తోసేసి ధైర్యంగా నిల్చుంటుంది.
ఈ మాటలు ఏవీ నన్ను నిలువరించలేవు. నిర్ణయించనూ లేవు అని చాటి చెప్తుంది.
ఆ కథ చదివిన మా మిత్రుడు ఆ మాటలు మానేశాడు.
మన పరిమితి మనమే ఈ ప్రపంచంలో ఆకలి అనడం మొదలుపెట్టాడు.

-జింబో 94404 83001