అవీ .. ఇవీ..

పచ్చలైటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డును చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అది ‘ఎల్’ బోర్డుతో నడుస్తున్న వాహనమే కావొచ్చు. రాంగ్ రూట్లో వస్తున్న వాహనం కూడా కావొచ్చు. ఇవి రెండు కాకుండా చౌరస్తాలలో కన్పించే పచ్చలైటు కూడా కావొచ్చు.
పనులని వాయిదా వేయడానికి మనకి ఎన్నో కారణాలు దొరుకుతాయి. అందులో ఒకటి మంచిరోజూ, మంచి ముహూర్తం. ఈ కారణాలు చెబుతూ మనం పనులని వాయిదా వేస్తుంటాం. ఏదో ఒక కారణం చూపెడుతూ మరి కొంతమంది తమ పనులని వాయిదా వేస్తూ ఉంటారు.
మేం ఉద్యోగంలో జాయిన్ కావడానికి మే ఒకటవ తేదీని హైకోర్టు నిర్ణయించింది. మా కిష్టమైన రోజుని మేం నిర్ణయించుకునే అవకాశం మాకు హైకోర్టు ఇవ్వలేదు. సమయం చెప్పలేదు కానీ తేదీని నిర్ణయించింది. అందరం ఉదయమే చేరిపోయాం. మంచి రోజుని చూసుకునే అవకాశం మాకు లేదు. ఆ తరువాత ఏ రోజు సౌకర్యంగా ఉంటే ఆ రోజు జాయిన్ అయ్యేవాణ్ణి.
మా మిత్రుడొకడు ఎప్పుడూ మంచి రోజుని, మంచి ముహూర్తాన్ని చూసి జాయిన్ అయ్యేవాడు. ఒకరోజు ఆయన భార్యకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆమెకు అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగింది. ఆ రోజు మంగళవారం. అందులోనూ అమావాస్య. మా మిత్రుడికి మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకునే అవకాశం లేదు.
పచ్చలైట్‌ని చూసి కూడా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎర్రలైట్, పచ్చలైట్లు కన్పిస్తూ ఉంటాయి. ఎర్రలైట్ కన్పిస్తే ఆగిపోతాం. అదే విధంగా పచ్చలైటు కన్పించగానే ప్రయాణం కొనసాగిస్తాం.
మన జీవితం ఓ ప్రయాణం లాంటిది. రోజూ ఎన్నో చౌరస్తాలని దాటుకుంటూ ప్రయాణం చేయాలి. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే పచ్చలైటు వెలగాలి. మన జీవన ప్రయాణంలో పచ్చలైట్లే ఉంటాయి. ఎర్రలైట్లు వుండవు. ఎర్రలైటును మనమే ఏర్పరచుకొని చాలా పనులని వాయిదా వేస్తూ ఉంటాం.
జీవితంలో విజయం సాధించాలంటే మన జీవన రహదారిలో ఎర్రలైటు లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. అదే విధంగా ఎప్పుడూ పచ్చలైటు వెలుగుతుందన్న విషయమూ గుర్తుంచుకోవాలి.
నక్షత్రాల కూడలి కోసం, గ్రహాల అనుగ్రహం కోసం వేచి చూస్తూ పనులని వాయిదా వేయడం అంత సమంజసం కాదు.
జీవితం చాలా చిన్నది. వేచి చూస్తూ కూర్చుంటే అది కరిగిపోతుంది.
అందరి జీవితాల్లో పచ్చలైటు వెలుగుతూనే ఉంది.
ప్రయాణం చేయడమే అందరి పని.

- జింబో 94404 83001