AADIVAVRAM - Others

ప్రకటనలు(సండేగీత )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర కటనలు చేయడం సులువు.
ప్రతిరోజూ చాలామంది ఎన్నో ప్రకటనలని చేస్తూ వుంటారు.
మా మిత్రుడు ఒకడున్నాడు. అతను భోజనప్రియుడు. కొంచెం బరువు పెరగగానే రేపటి నుంచి నేను డైటింగ్ చేస్తున్నానని ప్రకటన ఇస్తాడు. కానీ అమలు చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొద్ది రోజులు డైటింగ్ చేస్తాడు. ఆ తరువాత మళ్లీ మామూలే.
ఇట్లాగే మరో మిత్రుడు వున్నాడు. ఇప్పటికి ఓ యాభైసార్లు సిగరెట్లు మానేస్తానని ప్రకటనలు ఇచ్చాడు. అతను ఇంకా సిగరెట్లు తాగుతూనే ఉన్నాడు.
ప్రకటనలు చాలా సులువు. అమలు పరచడమే కష్టం.
చాలామంది తమ లక్ష్యాలని ప్రకటిస్తూ వుంటారు. కానీ అమలు పరచడంలో విఫలమవుతుంటారు.
నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనడం చాలా సులువు. కానీ ఆ ప్రేమని నిలపడం అంత సులువు కాదు. ఈ ప్రపంచాన్ని మారుస్తానని అనడం చాలా సులువు. కానీ తనని తాను మార్చుకుంటే అదే గొప్ప.
మనం ఏమి చేస్తామని చెప్పడం చాలా సులువు. కానీ అది చేసి చూపించడం అంత సులువు కాదు. దానికి కొంచెం శ్రద్ధ కావాలి. ఓర్పు కావాలి.
ఈ ప్రకటనలు చేయడం మా ఇద్దరి మిత్రులే కాదు. అందరూ చేస్తారు.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. అందరి జీవితంలో ఇలాంటి ప్రకటనలు సర్వసాధారణంగా వుంటాయి. ప్రకటనలు ప్రకటనల్లో కాకుండా చర్యల్లోకి మారాలి.
అయితే.
చర్యల్లోకి మారే క్రమంలో మనం చాలా వెచ్చించాల్సి వుంటుంది.
సమయాన్ని వెచ్చించాలి.
శక్తిని వెచ్చించాలి.
కొంత త్యాగం కూడా చేయాల్సి వుంటుంది.
చర్యల వల్ల మన ప్రపంచం కొంత మారుతుంది.
మన చుట్టూ వున్న ప్రపంచం కూడా అంతో ఇంతో మారుతుంది.
మరో ముఖ్యమైన విషయం-
మన చర్యలు ఈ రోజు నుంచే మొదలవ్వాలి.

- జింబో 94404 83001