ఓ చిన్నమాట!

విత్తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సృష్టి విచిత్రమైనది. ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహా వృక్షం పెరుగుతుంది. ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.
విత్తనం నుంచి పెద్ద మర్రిచెట్టు రావడం ఒక్క రోజులో జరిగే పని కాదు. దానికి దాని పెరుగుదల కోసం అవసరమైన నీరు, గాలి, వెలుతురు ఇట్లా ఎన్నో కావాల్సి వస్తుంది. ఎన్నో సంవత్సరాలకు గానీ అది మహావృక్షంగా పరిణమించదు.
మన ముందు ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తూ వుంటారు. వాళ్లు చాలా చిన్నవాళ్లలాగా కన్పిస్తారు. గుర్తింపు లేని విధంగా వుంటారు. వాళ్ల ఉనికిని కూడా మనం గుర్తించలేం. వాళ్లు ఎలాంటి ప్రభావం చూపించరని కూడా అనుకుంటాం. కానీ వాస్తవం అలా కాదు. వాళ్లు ఒక మహావృక్షంగా పరిణామం చెందవచ్చు. దానికి కావాల్సింది - మంచి వాతావరణం, ప్రోత్సహించే పరిస్థితులు ఇలా ఎన్నో కారణమవుతాయి.
ఒక మామూలు వ్యక్తి ఇతరులని ప్రభావితం చేసే రకంగా ఎదగాలంటే అతను చాలా కష్టపడాల్సి వుంటుంది.
నిరుత్సాహపరిచే వ్యక్తుల మధ్య కాకుండా ఉత్సాహపరిచే వ్యక్తుల మధ్య అతని జీవనం ఉండాలి.
అతని వెంట గొప్ప పుస్తకాలు ఉండాలి.
అతనికి మంచి మార్గదర్శి ఉండాలి.
అతని లక్ష్యాల వైపు అతని ప్రయాణం రోజూ కొనసాగాలి.
తన పరిమితులని తనే ఛేదించుకుంటూ ముందుకు కొనసాగాలి.
తన శక్తిసామర్థ్యాలని పూర్తిగా ఉపయోగించుకునే దిశగా అతను ప్రయత్నం చేయాలి.
అతని దృష్టి ఎప్పుడూ విత్తనం నుంచి మహావృక్షంగా మారిన విషయం మీద కేంద్రీకృతం కావాలి. అప్పుడే అతను జీవితంలో ఎదుగుతాడు.
మర్రి విత్తనం నుంచి మహావృక్షం ఎలా వచ్చిందో ఓ మామూలు మనిషి నుంచి మహామనిషి వస్తాడు. అందుకు కావాల్సింది నిరంతర సాధన, అధ్యయనం, ప్రయత్నం.
ఏ వ్యక్తిని కూడా మనం మామూలు వ్యక్తిగా పరిగణించడానికి వీల్లేదు. అతను ఎప్పుడో ఒక్కసారి మనల్ని ప్రభావితం చేసే రకంగా ఎదగవచ్చు.
ప్రతి విత్తనం మహావృక్షంగా పరిణామం చెందకపోవచ్చు. అదే విధంగా ప్రతి వ్యక్తి మహా మనిషి కాకపోవచ్చు.
సరైన పోషకాలు, వాతావరణం వుంటే ప్రతి విత్తనం మహావృక్షం అవుతుంది. అదే విధంగా మంచి వాతావరణంలో వుంటే మామూలు మనిషి మహామనిషి అయ్యే అవకాశం ఉంది.