అంతర్జాతీయం

ఉగ్రవాదానికి చెంపపెట్టు ‘పారిస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ సదస్సు విజయవంతం కావాలి
పరిస్థితి విషమిస్తే అన్ని దేశాలకూ ముప్పే
శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ఒబామా

పారిస్, నవంబర్ 30: పర్యావరణ మార్పులు నిరోధానికి ప్రపంచ దేశాలు కదలిరావడం ఉగ్రవాదానికి చెంపపెట్టేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. పారిస్‌పై ఇటీవల జరిగిన దాడుల నేపథ్యంలో ఉగ్రవాదం సహా ఎలాంటి విపత్తునైనా సంఘటిత శక్తితో ప్రపంచ దేశాలు ఎదుర్కోగలవన్న సంఘీభావానికి ఈ సదస్సు సంకేతమని పేర్కొన్నారు. 150కి పైగా ప్రపంచ దేశాల నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఒబామా ‘ఎక్కడైతే ఉగ్రవాదులు తెగబడ్డారు. అక్కడే ప్రపంచ శక్తి అంతా పర్యావరణ సదస్సులో కేంద్రీకృతం కావడం ఓ బలమైన సంకేతం’ అని అన్నారు. ఈ సందర్భంగా తాను పారిస్‌కు అక్కడ ప్రజల ధీరోదాత్తతకు శాల్యూట్ చేస్తున్నానని ఒబామా తెలిపారు. ‘ఉగ్రవాద నిరోధనకు అందుకు సంబంధించి పట్టుదలకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? ఈ పర్యావరణ పరిరక్షణ సదస్సు విజయవంతం కావాలి. అందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి’ అని అమెరికా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. వాతావరణంలో కర్బన ఉద్గారాల విసర్జన పరిమాణం పెచ్చరిల్లుతున్న దృష్ట్యా వేడెక్కిపోతున్న భూ మండలాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించి ఈ సదస్సు నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించాలన్నారు. భూ గోళాన్ని రక్షించుకోలేమన్న అనుమానాలకు నిరాశావాదానికి తెరదించే విధంగా ప్రపంచ దేశాలు కలిసి రావాలన్నారు. పర్యావరణ మార్పులను నిరోధించకపోతే భవిష్యత్ ఉత్పాతాల మయం అవుతుందని, భూతాపం పెరిగిపోవడంతోపాటు అనేక రకాలుగా విలయాలు, ఉపద్రవాలు నగరాలను, పట్టణాలను ముంచెత్తుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రంపంచ దేశాల సంఘటిత శక్తి వాతావరణ మార్పులను నిరోధించి పుడమిని, ప్రకృతిని తదుపరి తరాల భవితను పరిరక్షించాలని ఒబామా అన్నారు. ఈ శక్తి నిబద్ధత తమకు ఉందన్న వాస్తవాన్ని పారిస్ సదస్సుద్వారా ప్రపంచ నేతలు రుజువుచేయాలని ఉద్ఘాటించారు. పుడమిని రక్షించుకోవల్సిన చివరి తరుణం ఆసన్నమైందని పేర్కొన్న ఒబామా ‘ఈ పరిస్థితికి కారణం ధనిక దేశాలా, పేదదేశాల అన్నదానికి నిమిత్తం ఉంకూడదు. కొత్త ఒప్పందంలో ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని దేశాలను పర్యావరణ మార్పుల నిరోధకానికి నడుం బిగించాలి. పరిస్థితి విషమిస్తే దాని విపరిణామాలు ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టుముడుతాయన్న వాస్తవ దృష్టితో ముందుకు వెళ్లాలి’ అని ఒబామా ఉద్ఘాటించారు. (చిత్రం) అమెరికా అధ్యక్షుడు ఒబామా (పెద్దచిత్రం) పర్యావరణ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వివిధ దేశాధి నేతలు, ప్రతినిధులు. చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ (వెనుక వరుసలో)