జాతీయ వార్తలు

బిసిల గోడు పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబిసి ఎంపీల ధర్నా ప్రధాని అపాయింట్‌మెంట్ లేదని ఆరోపణ
న్యూఢిల్లీ, మార్చి 14: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెనకబడిన కులాలకు చెందిన పార్లమెంటు సభ్యుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, ఓబిసి ఎంపీల ఫోరం కన్వీనర్ వి హనుమంతరావు నాయకత్వంలో పలువురు ఎంపీలు ఆరోపించారు. వారంతా సోమవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దాదాపు 20 నిమిషాలపాటు ధర్నా నిర్వహించారు. జెడియు అధినాయకుడు శరద్ యాదవ్, బుట్టా రేణుక, ఆనంద భాస్కర్, దేవేందర్ గౌడ్, బూర నర్సయ్యగౌడ్‌తోపాటు ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంపీలు ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో బిసిల సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించేందుకు తమ ఫోరం ఎంతోకాలం నుంచి ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్‌మెంట్ దొరకలేదని వాపోయారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొంత సమయం కేటాయిస్తే తమ సమస్యలను వివరిస్తామంటూ మోదీకి లేఖ రాసినా ఇంత వరకూ స్పందనలేదని విహెచ్ ఆరోపించారు. ప్రధాని తీరుకు నిరసనగా తామీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. వెనకబడిన వర్గానికి చెందిన మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టినప్పుడు తమతోపాటు దేశంలోని కోట్లాది మంది బిసీలు సంతోషించారని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో తమ సమస్యలు పరిష్కారం కావటంతో పాటు తమకు మేలు జరుగుతుందని ఆశించగా అలాంటిదేమీ జరగలేదని హనుమ ఆవేదన వ్యక్తం చేశారు. బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయటం, కులాల వారీగా జనాభా సేకరించి విశే్లషించటం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించటం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించటం, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించటం గురించి నరేంద్ర మోదీకి వివరించాలనుకున్నా మోదీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆయన అన్నారు. (చిత్రం) బిసిల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వౌన దీక్ష చేస్తున్న విహెచ్