జాతీయ వార్తలు

పేలిన పెళ్లికానుక.. వరుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్‌ : పెళ్లి కానుక కారణంగానే పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశాలోని బొలాంగిర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకుతో పాటు అతడి బామ్మ కూడా చనిపోయింది. వధువు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.బోలన్‌గిర్‌ జిల్లాలోని పట్నాఘడ్‌ గ్రామంలో సౌమ్య శేఖర్‌ సాహూకి రీమా అనే యువతితో అయిదు రోజుల క్రితం పెళ్లి జరగ్గా, ఫిబ్రవరి 21న జరిగిన వివాహ రిసెప్షన్‌లో గుర్తుతెలియని వ్యక్తి నూతన దంపతులకు పెళ్లి కానుకగా ఒక పార్సిల్‌ ఇచ్చాడు. శుక్రవారం వారు ఇంట్లో ఆ పార్సిల్‌ను తెరిచారు. తెరిచిన వెంటనే అది పేలింది.