మంచి మాట

బ్రహ్మతత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మం సర్వాంతర్యామి. బ్రహ్మం వ్యావహారిక సత్తా మాత్రమే కాదు, ఈశ్వరుడే. సర్వం విష్ణుమయం జగత్. ఈశ్వరుడు మాయాశక్తిగా పేర్కొనబడే సగుణ బ్రహ్మం, సాకార బ్రహ్మం, నిరాకార బ్రహ్మం అని బ్రహ్వస్వరూపాలు. బ్రహ్మం మానవుడి నైతిక బాధ్యత. బ్రహ్మస్వరూపాన్ని మాటలతో వర్ణింపలేము. నిరూపించలేము. అది ఒక అనంతమైన అద్భుత ఊహ. సముద్రమును చూడని వ్యక్తికి దాని గురించి తెలిపినపుడు అది ఒక సువిశాలమైన అనంతమైన నీటిపట్టు, ఎటుచూచినా నీరే. ఆకాశం నీరు కలిసినట్లనిపిస్తుంది అని మాత్రమే విశదపరచగలము. కాని ఇంత అని చెప్పలేము.
ఇంతవరకు బ్రహ్మం ఇలాంటిదని, ఇలా ఉంటుందని ఎవరు కూడా మాటలతో వ్యక్తంచేయలేదు. వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, ధర్మగ్రంథాలు లోకంలో ఉచ్ఛిష్టాలైపోయాయి. వాటిని మానవులు పదే పదే పఠించడంవలన అవి ఉచ్ఛిష్టాలైనాయి. కాని బ్రహ్మం మాత్రం అలా ఉచ్చిష్టం కాలేదు. కాదు కూడా. ఎందుకనగా బ్రహ్మం గుణరహితమైనది. చలించకుండా ఉండే మేరు పర్వతంలా స్థిరమైనది. అంతేకాదు బ్రహ్మం అసంగం. పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు మొదలగు సమస్త ద్వంద్వాలకు బ్రహ్మం అతీతమైనది. బ్రహ్మం అనేది ఒక దీపం లాంటిది. దాని వెలుగులో మంచి చేయవచ్చును, చెడును కూడా చేయవచ్చును. ముఖ్యంగా బ్రహ్మం ఒక పాములాంటిది. పాము కోరల్లో విషం నిండి ఉంటుంది. ఆ విషం వల్ల పాముకు ఎలాంటి హాని జరగదు. కాని అది కాటువేసిన ప్రాణులకు మాత్రం ప్రాణాపాయం వుంటుంది. అదేవిధంగా ఈ లోకంలో దుఃఖం, పాపం, ఇతర దోషాలు మనలను మాత్రమే బాధిస్తాయి. కాని బ్రహ్మం వీటన్నిటికీ అతీతమైనది. మంచి చెడు, నీతి నియమాలు బ్రహ్మానికి మాత్రం అనువర్తింపజేయలేము. పాపపుణ్యాలు, జ్ఞానా జ్ఞానాలు ధర్మాధర్మాలు వీటన్నింటికి బ్రహ్మం అతీతం. అది సమస్త ద్వంద్వాతీతము.
బ్రహ్మం మనస్సునకు, వాక్కుకు ఎంత మాత్రము అందదు. తెలివి, తెలిసినవాడు, తెలియదగింది అనే ఈ మూడింటికి అతీతం. సమస్త ద్వంద్వాలకు అతీతం. సుగంధాన్ని, దుర్గంధాన్ని వహిస్తూ వాటిచే కళంకితం కాని వాయువు లాంటిది బ్రహ్మం. బ్రహ్మం సమస్త గుణాతీతం. మాయతో సంబంధించిన సర్వస్వమునకు అతీతం.
ఈ సృష్టిలోని జీవ జగత్తులు అసత్యం, అనిత్యం. కాని బ్రహ్మం మాత్రం సత్యం, నిత్యం. ఈ జగత్తు మాయ అని చెబుతుంటాము. కాని ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉన్నది. మనం కర్పూర నీరాజనం వెలిగించినపుడు చివరకు ఏమి మిగలదు. కాని ఏ పదార్థాన్ని మండించినా బొగ్గో, బూడిదో మిగులుతుంది. సదా సద్విచారం పూర్తియై నిర్వికల్ప సమాధి ప్రాప్తించినపుడు మాత్రమే నువ్వు, నేను, జగత్తు అనే స్ఫురణ సమసిపోతుంది. వ్యక్తిత్వ భావన పూర్తిగా సమసిపోయినపుడు మాత్రమే సమాధి స్థితిలో బ్రహ్మ సాక్షాత్కారమవుతుంది. అప్పుడు జగత్తు సత్యమా? లేక మాయా? సమస్యలన్నీ శాశ్వతంగా సమసిపోతాయి. నిష్క్రియమైన బ్రహ్మమూ, క్రియాయుక్తమైన ప్రకృతి ఒక్కటే. ఆ సచ్చిదానందమయుడే సర్వజ్ఞా, చిచ్ఛక్తి, ఆనందమయమైన జగజ్జనని. రత్నము దాని ప్రకాశం ఒక్కటే. ఇవి రెండూ పరస్పర సంబద్ధాలు. సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము ఒక్కటే. మనం ఒకదానిని నమ్మితే ఇక రెండవదానిని కూడా నమ్మినట్లే. సూర్యుని కిరణాలకు భిన్నంగా సూర్యుణ్ణి, సూర్యునికి భిన్నంగా సూర్యకిరణాలను ఊహించలేము. పాలను విడిచి తెల్లదనం, తెల్లదనమును విడిచి పాలు ఉండవు. అదేవిధంగా సగుణ బ్రహ్మం మినహా నిర్గుణ బ్రహ్మాన్ని, నిర్గుణ బ్రహ్మం మినహా సగుణ బ్రహ్మాన్ని యోచించలేము. సృష్టి స్థితిలయలు ఎక్కడుంటాయో అక్కడే శక్తి ఉంటుంది. అదేవిధంగా సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మం సర్వవేళలయందు సృష్టి స్థితి లయకారణమైన విచ్ఛక్తే. సగుణ బ్రహ్మమంటే శక్తితో కూడి ఉన్న బ్రహ్మం. దానే్న ఈశ్వరుడని కూడా అంటారు. ఇక జగజ్జనని అనేకమై గోచరించే ఏకైక తత్త్వం. ఆమె అనంత శక్తి, అనంత శక్తిమయి. వేదాంతులు బ్రహ్మమనేది ఆ జగజ్జననియే గాని వేరొండు కాదని అంటారు. నిర్గుణ బ్రహ్మం యొక్క సగుణ స్వరూపమే ఆ అమ్మ. ఆ అమ్మే ఆదిశక్తి, పరాశక్తి, అనంతశక్తి, విశ్వరూపిణి, విశ్వంభరి.

-పెండెం శ్రీధర్