ఐడియా

ఆలివ్ ఆయిల్‌తో లాభాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలివ్ ఆయిల్ గురించి తెలుసుకుంటారే తప్ప చాలామంది మహిళలు ఉపయోగించే ప్రయత్నం చెయ్యరు. వాస్తవానికి ఆయిల్ మాయిశ్చరైజర్‌కు చాలా ఉపకారి. స్నానానికి ముందు చర్మానికి అప్లయ్ చేయడంవల్ల చర్మం మృదువుగా, సహజంగా మెరిసిపోతుంది. సున్నితమైన చర్మం కలవారికి తిరుగులేని విధంగా ఉపయోగపడేది ఆలివ్ ఆయిలేనంటే అతిశయోక్తి కాదు. మేకప్ తొలగించుకోడానికి కూడా చక్కగా పనికొస్తుంది.
శిరోజాల విషయానికి వస్తే ఇది అద్భుతమైన కండినషనర్‌గా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్‌లో కొద్ది చుక్కలు నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి నలభై నిముషాల తర్వాత కడిగేయాలి. దీనివలన జుట్టుకు అనేక పోషకాలు లభించడమే కాక మృదువుగానూ ఉంటుంది.
శిరోజాలు, చర్మం, చివరకు ఇంటి క్లీనింగ్‌కు సైతం ఆలివ్ ఆయిల్ ఉపయుక్తమైంది. ఆలివ్ ఆయిల్ చెక్క ఫర్నిచర్‌కు చక్కని పాలిష్‌గా పనిచేస్తుంది. మెత్తని వస్త్రంపై కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఫర్నిచర్‌ను తుడిస్తే చాలు మెరిసిపోతుంది.
లెదర్ వస్తువులు తుడవడానికి కూడా ఆలివ్ ఆయిల్ పనికివస్తుంది. లెదర్ పాడవకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితులనుంచి లెదర్‌ను రక్షిస్తుంది. తలుపులు, కిటికీల వంటివి మూసేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తున్నట్లయితే కొద్దిగా దూదిని ఆలివ్ ఆయిల్‌లో ముంచి అప్లయ్ చేస్తే సరవుతాయి.
పెయింట్, గ్రీజ్, గమ్ వంటి మరకలను తొలగించటంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. మరకలు పడిన చోట ఆలివ్ నూనె అప్లయ్ చేసి డిటర్జెంట్‌తో వెంటనే కడిగేయాలి. అప్పుడా మరకలు పోతాయి. అనేక రకాల ఉపయోగాలున్న ఆలివ్ ఆయిల్‌ని నిత్యావసర వస్తువులతోపాటు ఇంటిలో ఉంచుకోవడం ఉత్తమం.

- హిమజారమణ