హైదరాబాద్

నిఘా నీడలో పాతబస్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీ
ప్రార్థనా మందిరాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు
హైదరాబాద్, డిసెంబర్4 : బాబ్రీ మసీదు విధ్వంసానికి నిరసనగా ఈనెల 6వ తేదీన బ్లాక్ డేను నిర్వహించడానికి కొన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఆప్రమత్తమైన పోలీసులు పాతబస్తీలో నిఘాను ముమ్మరం చేశారు. బ్లాక్‌డే సందర్భంగా పాతబస్తీలో ఏలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దక్షిణ మండలం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు పలు ప్రధాన కూడలల్లో నిర్వహిస్తున్నారు. బ్లాక్ డే సందర్భంగా గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా ఉండేందుకు గాను పోలీసులు ఉన్నాతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాతబస్తీలోని వివిధ ప్రార్థన మందిరాల వద్ద, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేసి ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, మొగల్‌పుర, సైదాబాద్, తాలాబ్‌కట్టా, మీర్‌చోక్, హుస్సేనిఆలం, మాదీన, బహదూర్‌పుర, చత్రినాక, షాలిబండా, ఫలక్‌నుమా, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తూ అనుమానం కలిగిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు, మూడు రోజుల పాటు దక్షిణ మండలం పరిధిలోని అన్ని పోలీస్టేషన్‌లకు చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని పోలీసు ఉన్నాతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్‌డే సందర్భంగా పాతబస్తీలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు.

రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, డిసెంబర్ 4: భూపరిపాలన ఛీఫ్ కమిషనర్ రేమండ్ పీటర్ నిర్వహించిన వివిధ జిల్లాల కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ జిల్లా రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. భూపరిపాలన ఛీప్ కమిషనర్ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ అంశాలపై సమీక్షించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా మాట్లాడుతూ జిల్లాలో జిఓ 58 నుండి జిఓ 59కి మార్చబడిన దరఖాస్తుదారులు చెల్లించే మొత్తంలో కొంతమేరకు తగ్గించాలని కోరారని, జిఓ 12ను జారీ చేశారని తెలిపారు. జిఓ 59 కింద ఒకే వ్యక్తి రెండు, మూడు స్థలాలకు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలను క్షుణంగా పరిశీలించాలని సిసిఎల్‌ఎ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ భారతి హోలికేరి, ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

సుందర నగరంగా హైదరాబాద్
నల్లకుంట, డిసెంబర్ 4: హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే నగరానికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి తెలియజేశారు. శుక్రవారం అంబర్‌పేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్ధానిక ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డితో కలసి ప్రారంభోత్సవం చేశారు. నల్లకుంట డివిజన్‌లోని తిలక్‌నగర్ రైల్వే బ్రిడ్డివద్ద 3.5 లక్షల వ్యయంతో రైల్వేట్రాక్ రిటైనింగ్ పనులకు, తిలక్‌నగర్ పెద్ద గణేష్ వద్ద 7లక్షల రూపాయల వ్యయంతో ఫుట్‌పాత్ పెయింటింగ్ పనులు, గోల్నాక డివిజన్‌లోని ఖాద్రీబాగ్ జేస్వాల గార్డెన్‌లో 8లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు పనులకు, విద్యానగర్ డివిజన్‌లోని డిడి కాలనీలో ఫుట్‌పాత్ నిర్మాణ పనులకు ప్రాంరంభోత్సవం చేశారు. ఈసందర్భంగా హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ నగరంలో అసలు అభివృద్ధి ఇప్పుడే మొదలయిందని, కొద్దిరోజుల్లోనే నగర రూపులేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేకుండా పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు వౌలిక సదుపాయలు కల్పించి సమస్యల నుంచి వారిని దూరం చేయడానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని స్వచ్ఛ హైదరాబాదులో గుర్తించిన పనులకు యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో మంజూరైన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయలని కోరారు. రాజకీయలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ ఐక్యంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి, టిఆర్‌ఎస్ నాయకులు గరిగంటి రమేష్, గోల్నాక మాజీ కార్పొరేటర్ కాలేరు వెంకటేష్, సాంబశివగౌడ్, పార్టీ సీనియర్ నాయకులు పాక చందర్, గుంటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

శ్వాసపై ధ్యాసతో మానసిక ప్రశాంతత
గచ్చిబౌలి, డిసెంబర్ 4: రోజుకి ఒక గంట క్రమం తప్పకుండా శ్వాసపై ధ్యాస పెట్టి యోగధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా వుంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీసుస్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న యోగ ధ్యానం క్లాసులు ముగింపునకు సిపి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. యోగ వలన పోలీసు సిబ్బందిలో చాలా మార్పు వస్తుందని, కమిషనరేట్‌లోని 2వేల మంది పోలీసులకు, 2వేల మంది అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆహార అలవాట్లు పాటించకపోవడంవలన పోలీసులు పదవీ విరమణ సమయానికి రోగాల బారిన పడుతున్నారని, అది గమనించి అందరికీ యోగ తరగతులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. వారంలో ఐదురోజులు జరిగే శిక్షణలో డిసిపి స్థాయి అధికారులు కూడా ఏదో ఒకరోజు పాల్గొనేలా చూస్తామని అన్నారు.
చక్కెర, పాలు, బియ్యం, ఉప్పువలనే మనిషికి ముప్పు వాటిల్లుతుందని సిపి పేర్కొన్నారు. మెదడు స్వాధీనంలో వుంచుకుంటే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చని ఆనంద్ తెలిపారు. క్లిష్టమైన సమస్యలు వచ్చినపుడు ప్రశాంతంగా ఆలోచించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సా. 7 గంటలలోపు భోజనం తినాలని, సమయం దాటితే ఆరోజు పండ్లు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, అనంతరం యోగ చేయాలని సూచించారు. యోగ, వ్యాయామంతో మానసిక ప్రశాంతత కలుగుతుందని, పోలీసుస్టేషన్‌కి వచ్చేవారితో వినయంగా మాట్లాడ గలుగుతారని కమిషనర్ తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన పోలీసులను అడగ్గా- తమకు యోగ తరగతులవలన తమ జీవితాలలో చాలా మార్పు వచ్చిందని, కుటుంబసభ్యులతోపాటు ఇరుగుపొరుగు వారికి వివరించి సంపూర్ణ ఆరోగ్య సమాజం కోసం కృషి చేస్తామని వారు చెప్పారు. పోలీసుస్టేషన్‌కు వచ్చేవారితో కూడా గౌరవంగా మాట్లాడటానికి ఈ తరగతులు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ గాంధీ నారాయణ, వైద్యులు సుకుమార్ పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

వివాదాల్లేని భూముల్లో డబుల్ బెడ్ రూం!
హైదరాబాద్, డిసెంబర్ 4: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎలాంటి వివాదాల్లేని భూముల్లోనే డబుల్ బెడ్ రూం స్కీంను అమలు చేస్తూ ఇళ్లను నిర్మించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల గృహ నిర్మాణ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ రెండు జిల్లాల్లో ఎక్కడైతే వివాదం లేని భూములు సిద్ధంగా ఉన్నాయో గుర్తించి, సంబంధిత శాసన సభ్యుల అంగీకారంతో ఇళ్ల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన భూములకు జిల్లా కలెక్టర్ల నుంచి క్లియరెన్స్ సర్ట్ఫికెట్ పొందాలన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన సమస్యలున్నా, వెంటనే తన దృష్టికి గానీ, కలెక్టర్ల దృష్టికి గానీ తెచ్చి వెంటనే పరిష్కార మార్గాలను పొందాలని హౌజింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నర్మించనున్నట్లు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి గాను ఇప్పటికీ 31 స్థలాలు ఎంపిక చేయటం జరిగిందని, వీటిలో 9 స్థలాల్లో మూడు అంతస్తుల భవనాలు, 22 స్థలాల్లో 9 అంతస్తుల భవనాలను ఈ స్కీం కింద నిర్మిచేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపారు. ఆయా స్థలాల్లో నివాసితులను డబుల్ బెడ్ రూం ఇళ్లకు ఒప్పించేందుకు స్రాకో స్వచ్ఛంధ సంస్థతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు కలిసి తొలుత కౌనె్సలింగ్ నిర్వహించగా, బహుళ అంతస్తు భవనాల నిర్మాణానికి వ ఆరు అంగీకరించారని తెలిపారు. చిలుకలగూడ, దోభీఘాట్, ఇందిరానగర్, పిల్లిగుడిసెలు, సయ్యద్‌సాబ్‌కా బాడా, జంగమ్మెట్‌లలో ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నర్మిణానికి అంచనాలు రూపొందించినట్లు, త్వరలోనే టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎన్నికలపై ఓటర్లకు అవగాహన
జిహెచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ప్రతి అర్హులైన ఓటరుకు ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదిలేనిది తనిఖీలు చేసుకోవటంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు తగు ఆగధారాలతో కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించటంలో సహకరించాలని కమిషనర్ ఉభయ జిల్లాల కలెక్టర్లను కోరారు. ఇలా నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను వారం రోజుల్లోగా విచారించి, తగు నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ విషయంలో రెవెన్యూ తదితర శాకల అధికారులు సిబ్బందిచే నగర పౌరుల్లో ప్రచారం కల్పించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన కలెక్టర్లను కోరారు.

రంగస్థల నటులకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, డిసెంబర్ 4: ప్రముఖ రంగస్థల నటులు వనం శంకరయ్య, ఆకెళ్ల పార్వతికి ఆత్మీయ సత్కార కార్యక్రమం కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లి గానసభలోని కళాలలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రాఫిక్ అడిషనల్ సుంకర సత్యనారాయణ విచ్చేసి ఆత్మీయ సత్కారం నిర్వహించారు. కళాకారులను సత్కారించడం ఎంతో అభినందనీయమన్నారు. కళాకారులను గౌరవించడానికి సంస్కృతిక సంస్థలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఘంటసాల జయంతి సందర్భంగా సంగీత కళాకారులకు పాటల పోటీలను నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా.పులివర్తి కృష్ణమూర్తి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రపంచ రికార్డు గ్రహీత డా.కళావేంకట దీక్షితులు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.పుష్పలత, ఎ.సురేందర్ పాల్గొన్నారు.

నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించాలి
హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన రెవెన్యూ సేవలు అందించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్లు కృషి చేయాలని రాష్ట్ర భూపరిపాలన చీఫ్ కమిషనర్ రేమండ్ పీటర్ సూచించారు. శుక్రవారం భూపరిపాలన చీఫ్ కమిషనర్ కార్యాలయం నుంచి రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది విధులపై దృష్టి పెట్టాలని అన్నారు. రెవెన్యూ శాఖ అందిస్తున్న సేవలు, ధ్రుకరణ పత్రాలు ఆన్‌లైన్‌లో మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండల రెవెన్యూ అధికారులకు డిజిటల్ సంతకంపై పూర్తి పట్టు ఉండాలని సూచించారు. త్వరలోనే ఆధార్, బయోమెట్రిక్‌తో మండల అధికారులు.. కంప్యూటర్ ఆపరేటర్‌ల మీద ఆధారపడకుండా స్వయంగా మంజూరు ఇచ్చేవిధంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అందుబాటులోకి తెస్తామని అన్నారు. విఆర్‌ఓలు గ్రామాలలో ఉండేవిధంగా జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యమైన సమావేశాలకే ఆర్డీఓలు హెడ్‌క్వార్టర్స్ వదిలి పిలవరాదని తెలిపారు. విఆర్‌ఓలకు ఇచ్చే ట్యాబ్ ద్వారా అన్ని వివరాల నమోదుపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్లు క్షేత్రస్థాయి కార్యాలయాలను ఎప్పటికప్పుడు పర్యావేక్షించాలని సూచించారు. జమాబంధి, భూసేకరణ, జిఓ 58, 59, సేత్వార్ డాటా ఎంట్రీ, ఎల్‌ఇసి వెరిఫికేషన్, టిఎస్‌ఐఐసి ల్యాండ్ బ్యాంక్ వెరిఫికేషన్‌పై సిసిఎల్‌ఎ సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో జిఓ 58 ద్వారా 70వేల దరఖాస్తులు రాగా దాదాపు 58వేల మందికి సర్ట్ఫికెట్‌లు పంపిణీ చేశామని అన్నారు. జిఓ 59 ద్వారా 11500 దరఖాస్తులు స్వీకరించామని, విచారణ పూర్తయ్యిందని తెలిపారు. వీటిలో ఐదువేల దరఖాస్తులు అర్హత కలిగినవిగా గుర్తించామని అన్నారు. వెబ్‌ల్యాండ్ వైబ్‌సైట్‌లో కొన్ని మార్పులకు సలహాలు ఇచ్చామని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, డిఆర్‌ఓ ధర్మారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి జగదీష్ పాల్గొన్నారు.