తెలంగాణ

పాతబస్తీలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ సందర్భంగా ఎంఐఎం, కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం ఫలితంగా పాతబస్తీలోని మీర్‌చౌక్ ప్రాంతంలో మంగళవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఘర్షణ నేపథ్యంలో పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ గౌస్‌ను పోలీసులు అరెస్టు చేసి మీర్‌చౌక్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసు స్టేషన్ వద్ద యుద్ధ వాతావరణం ఏర్పడింది. గౌస్‌ను విడుదల చేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఎన్నికల సంఘం అధికారుల ఆదేశంతో పోలీసులు గౌస్‌ను విడిచిపెట్టారు. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు గౌస్‌తో కలిసి వెళుతుండగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్, ఆ పార్టీ కార్యకర్తలు తారసపడడంతో గొడవ జరిగింది. ఎంఐఎం కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో కాంగ్రెస్ నేతల వాహనాలు దెబ్బతిన్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.